PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-ycp-jagan-ysrcp66a57a1d-40ff-40dc-8acd-8c33435df2e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-ycp-jagan-ysrcp66a57a1d-40ff-40dc-8acd-8c33435df2e0-415x250-IndiaHerald.jpg- న‌వ‌ర‌త్నాల కొన‌సాగింపుగా న‌వ‌ర‌త్నాలు ఫ్ల‌స్‌ - సామాజిక భ‌ద్ర‌త పేరుతో 2024 మేనిఫెస్టో రిలీజ్‌ ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) 2019లో ఎన్నికల్లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసిన వైసీపీ అధినేత వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ సారి 2024 ఎన్నిక‌ల మేనిఫెస్టోను కూడా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ చేశారు. 2019 ఎన్నిక‌ల మేనిఫెస్టోకు న‌వ‌ర‌త్నాల పేరు పెట్టిన జ‌గ‌న్ ఈ సారి 2024 ఎన్నికల్లో సామాజిక భద్రత పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ycp; jagan; ysrcp{#}nidhi;Two-wheeler drivers;Amaravathi;mithra;Ammavodi;Hanu Raghavapudi;Driver;India;Reddy;CM;Jagan;YCP2024 అంచ‌నాలు తారుమారు చేసే జ‌గ‌న్ మేనిఫెస్టో ఇది... ఆ మిస్టేక్‌లు క‌రెక్ట్ చేసేసిన జ‌గ‌న్‌..?2024 అంచ‌నాలు తారుమారు చేసే జ‌గ‌న్ మేనిఫెస్టో ఇది... ఆ మిస్టేక్‌లు క‌రెక్ట్ చేసేసిన జ‌గ‌న్‌..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ycp; jagan; ysrcp{#}nidhi;Two-wheeler drivers;Amaravathi;mithra;Ammavodi;Hanu Raghavapudi;Driver;India;Reddy;CM;Jagan;YCPSat, 27 Apr 2024 15:49:07 GMT- న‌వ‌ర‌త్నాల కొన‌సాగింపుగా న‌వ‌ర‌త్నాలు ఫ్ల‌స్‌
- సామాజిక భ‌ద్ర‌త పేరుతో 2024 మేనిఫెస్టో రిలీజ్‌

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

2019లో ఎన్నికల్లో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసిన వైసీపీ అధినేత వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ సారి 2024 ఎన్నిక‌ల మేనిఫెస్టోను కూడా భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ చేశారు. 2019 ఎన్నిక‌ల మేనిఫెస్టోకు న‌వ‌ర‌త్నాల పేరు పెట్టిన జ‌గ‌న్ ఈ సారి 2024 ఎన్నికల్లో సామాజిక భద్రత పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టో  విడుదల చేశారు. గతంలో ఇచ్చిన హామీలు 99 శాతం అమలు చేశామని ఇప్పుడు మరింతగా ప్రజలకు మేలు చేస్తామని జ‌గ‌న్ చెప్పారు.


2019 ఎన్నికల్లో విజ‌యం సాధించి... అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి ఎక్కువ పేరు తీసుకొచ్చిన వాటిపై ఎక్కువ ఫోకస్ చేసిన వైసీపీ... వాటిని పెంచేందుకు మొగ్గు చూపించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సంక్షేమంపై ఫోక‌స్ పెట్టిన వైసీపీ ఇప్పుడు అదే మంత్రం న‌మ్ముకుంది. గ‌త ఐదేళ్ల‌లో కొన్ని వ‌ర్గాల్లో ఉన్న అసంతృప్తిని ప‌సిగ‌ట్టి ఈ సారి వాటిపై బాగా ఫోక‌స్ పెట్టింది. యువత, మహిళల కోసం ప్రత్యేక హామీలతో మేనిఫెస్టో రూపొందించారు. గ‌త ఐదేళ్ల‌లో వీళ్ల అసంతృప్తిగా ఉన్నార‌నే జ‌గ‌న్ ఈ మిస్టేక్ క‌వ‌ర్ చేసుకున్నారు.


వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో 2024 హైలెట్స్ :
- రెండు విడతల్లో పింఛన్లు 3500లకు పెంచుతామన్న జగన్‌... అది ఇప్పట్లో సాధ్యం కాదని.. చివ‌రి రెండేళ్ల‌లో పెంచుతామ‌ని క్లారిటీ ఇచ్చేశారు.
- వైఎస్‌ఆర్ చేయూత కింద 1,50 ,000
- జగనన్న అమ్మఒడి - 17,000
- వైఎస్‌ఆర్ కాపు నేస్తం- రూ. 1.20,000
- వైఎస్‌ఆర్ ఈబీసీ నేస్తం- రూ. 1,05000
- వైఎస్‌ఆర్‌ ఆసరా కింద 3,00,000 వరకు సున్నా వడ్డీ రుణాలు


- రైతుభరోసా 13500 నుంచి 16000కు పెంపు
ఇది కూడా పంట వేసిన‌ప్పుడు ప్రారంభంలో 8000, మ‌ధ్య‌లో 4 వేలు.. చివ‌ర్లో క‌టింగ్ స‌మ‌యంలో 4 వేలు ఇస్తున్న‌ట్టు చెప్పారు.
- మత్య్సకారు భరోసా- లక్ష రూపాయల వరకు పెంపు
- వాహన మిత్ర - లక్ష వరకు పెంపు
- లారీ, టిప్పర్ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం వర్తింపు


- డ్రైవర్లకు రు. 50 పైస‌ల‌కే వాహన రుణాలు ఇప్పిస్తాం
- డ్రైవర్లు ప్రమాదాల్లో చనిపోతే 10 లక్షల బీమా
- ప్రతి నియోజకవర్గం స్కిల్‌ హబ్‌ ఏర్పాటు.. తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీ
- అబ్బాయిలకు 2500, అమ్మాయిలకు 3000 వరకు స్కిల్‌ కాలేజీల్లో, యూనివర్శిటీల్లో చదువుకున్న వాళ్లకు స్టైపెండ్  
- మొత్తం జనాభాలో 50 శాతం దళితులు ఉండి 500పైగా ఆవాసాలు ఉంటే ప్రత్యేక పంచాయతీల ఏర్పాటు


- ప్రార్థనా మందిరాల నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు
- తోపుడు బండ్ల వాళ్లకు ఇచ్చే డబ్బులను 15 వేల నుంచి 20 వరకు పెంపు
- ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు తీసుకునే బ్యాంకు రుణాల వ‌డ్డీ ప్ర‌భుత్వ‌మే భ‌రించేలా హామీ
- 25 వేల జీతం తీసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు నవరత్నాలు వర్తింపు



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>