MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/agfd07ffa8-cf6f-4bc8-adc4-a2a4d915de44-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/agfd07ffa8-cf6f-4bc8-adc4-a2a4d915de44-415x250-IndiaHerald.jpgఈ నగరానికి ఏమైంది మూవీ తో పెండి తేరకు పరిచయం అయిన అభినవ్ గోమఠం ఈ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన ఈయన ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఇన్ని రోజుల పాటు సినిమాల్లో కమీడియన్ గా , ఇతర పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అభినవ్ ఈ మధ్య కాలంలో వరసగా సినిమాల్లో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈయన "మస్తు షేడ్స్ ఉన్నాయి రా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ పag{#}Kumaar;shashank;Divya Bhatnagar;Tollywood;Reddy;Hero;cinema theater;Cinema"ఓటిటి" లో సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న "మై డియర్ దొంగ"..!"ఓటిటి" లో సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న "మై డియర్ దొంగ"..!ag{#}Kumaar;shashank;Divya Bhatnagar;Tollywood;Reddy;Hero;cinema theater;CinemaSat, 27 Apr 2024 13:03:24 GMTఈ నగరానికి ఏమైంది మూవీ తో పెండి తేరకు పరిచయం అయిన అభినవ్ గోమఠం ఈ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన ఈయన ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఇన్ని రోజుల పాటు సినిమాల్లో కమీడియన్ గా , ఇతర పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన అభినవ్ ఈ మధ్య కాలంలో వరసగా సినిమాల్లో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. 

అందులో భాగంగా కొంత కాలం క్రితమే ఈయన "మస్తు షేడ్స్ ఉన్నాయి రా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా ఈయన "మై డియర్ దొంగ" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను అందుకున్నట్లు ఆహా సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

ఇలా ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది. B S సర్వజ్ఞ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ని మహేశ్వర్ రెడ్డి మరియు చంద్ర వెంపటి లు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ లో దివ్య శ్రీపాద , నిఖిల్ గాజుల మరియు సాయి శశాంక్ మండూరి కూడా కీలక పాత్రలు పోషించారు. ఇక నేరుగా థియేటర్ లలో కాకుండా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల ఆయన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కుతూ ఉండడంతో ఈ మూవీ బృందం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>