Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/deaghf0e6d08f-5ce5-4ab4-b68f-674d734fb798-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/deaghf0e6d08f-5ce5-4ab4-b68f-674d734fb798-415x250-IndiaHerald.jpgతల్లి కడుపులో నుంచి బయటికి వచ్చిన తర్వాత మనిషికి ఎప్పుడు ఎలా మరణం సంభవిస్తుంది అని చెప్పడం చాలా కష్టం. సాధారణంగా అయితే వృద్ధాప్యం వచ్చిన తర్వాత లేదంటే ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య వస్తేనే ప్రాణాలు పోతాయి అని మొన్నటి వరకు జనాలు నమ్మేవారు. కానీ ఇటీవల కాలంలో అనూహ్యమైన ఘటనలు మనిషి ప్రాణాలను అర్ధంతరంగా తీసేస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా సడన్ హార్ట్ ఎటాక్ లు చూస్తూ చూస్తుండగానే ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇంకొన్ని ఘటనల్లో ఇక విధి చిన్నచూపు చూడటంతో ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ వెలుగులోకి Deagh{#}reshma;Parents;yadadri;Eluru;Heart Attack;Father;Teluguవాళ్లకేం తెలుసు అక్కడే మృత్యువు ఉందని.. చివరికి?వాళ్లకేం తెలుసు అక్కడే మృత్యువు ఉందని.. చివరికి?Deagh{#}reshma;Parents;yadadri;Eluru;Heart Attack;Father;TeluguSat, 27 Apr 2024 07:25:00 GMTతల్లి కడుపులో నుంచి బయటికి వచ్చిన తర్వాత మనిషికి ఎప్పుడు ఎలా మరణం సంభవిస్తుంది అని చెప్పడం చాలా కష్టం. సాధారణంగా అయితే వృద్ధాప్యం వచ్చిన తర్వాత లేదంటే ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య వస్తేనే ప్రాణాలు పోతాయి అని మొన్నటి వరకు జనాలు నమ్మేవారు. కానీ ఇటీవల కాలంలో అనూహ్యమైన ఘటనలు మనిషి ప్రాణాలను అర్ధంతరంగా తీసేస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా సడన్ హార్ట్ ఎటాక్ లు చూస్తూ చూస్తుండగానే ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇంకొన్ని ఘటనల్లో ఇక విధి చిన్నచూపు చూడటంతో ప్రాణాలు పోతున్నాయి.


 ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో ఉపశమనం కోసం ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంత మంది ఏసీల ముందు కూర్చొని ఉపశమనం పొందుతే ఇంకొంతమంది ఫ్యాన్ల ముందు కూర్చుంటున్నారు. మరి కొంతమంది మాత్రం దగ్గరలో ఉన్న చెరువుల్లోకి వెళ్లి స్నానం చేసి ఉపశమనం పొందాలని అనుకుంటున్నారు. అయితే ఇలా ఈత సరదా చివరికి ఎన్నోకుటుంబాలలో విషాదాన్ని నింపేస్తుంది. ఈత సరదా తెలుగు రాష్ట్రాల్లోనే పలు కుటుంబాల్లో చివరికి ఎంతోమంది తల్లిదండ్రులు కడుపు కోతకు కారణమైంది.


 అయిన ఇలా ఈతకు వెళ్లాలి అనుకున్నవాళ్ళకేం తెలుసు అక్కడే వారికోసం మృత్యువు వేచి చూస్తుందని చివరికి సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని ఏలూరు జిల్లా జల్లేరు వాగులో ఈతకు వెళ్లే ముగ్గురు మరణించారు. ఇందులో రేష్మ 24 అనే యువతి కూడా ఉంది. ఆమెతో పాటు మొహ్సిన్ 23, హసన్ 14 వాగులో మునిగి చనిపోయారు. ఇక తెలంగాణలోను యాదాద్రి జిల్లా చాడా గ్రామంలో చెరువులో మునిగి తండ్రి కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. ఇలా ఎండవేడికి సరదాగా ఈత కొట్టాలి అనుకున్న వారు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>