PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/stella-satishd721279b-9736-4c4c-af7d-99bb6d86da33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/stella-satishd721279b-9736-4c4c-af7d-99bb6d86da33-415x250-IndiaHerald.jpgకర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న ఆదిమూలపు సతీష్ ఇప్పటికే విశ్రాంతి లేకుండా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదిమూలపు సతీష్ భార్య స్టెల్లా సతీష్ సైతం భర్త గెలుపు కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టెల్లా సతీష్ ఇంటింటా తిరుగుతూ వైసీపీ పథకాలను ప్రచారం చేయడంతో పాటు తన భర్తకే ఓటేయాలని కోరుతున్నారు. stella satish{#}sathish;District;Service;Josh;YCP;Husband;Jagan;TDP;Partyభర్త గెలుపు కోసం కదం తొక్కిన స్టెల్లా సతీష్.. కోడుమూరు వైసీపీ అభ్యర్థి గెలుస్తారా?భర్త గెలుపు కోసం కదం తొక్కిన స్టెల్లా సతీష్.. కోడుమూరు వైసీపీ అభ్యర్థి గెలుస్తారా?stella satish{#}sathish;District;Service;Josh;YCP;Husband;Jagan;TDP;PartySat, 27 Apr 2024 08:30:00 GMTకర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేస్తున్న ఆదిమూలపు సతీష్ ఇప్పటికే విశ్రాంతి లేకుండా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదిమూలపు సతీష్ భార్య స్టెల్లా సతీష్ సైతం భర్త గెలుపు కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టెల్లా సతీష్ ఇంటింటా తిరుగుతూ వైసీపీ పథకాలను ప్రచారం చేయడంతో పాటు తన భర్తకే ఓటేయాలని కోరుతున్నారు.
 
మండుటెండలను సైతం లెక్క చేయకుండా ఆమె కష్టపడి ప్రచారం చేస్తూ వైసీపీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. కోడుమూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తూ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రమే పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ పథకాల అమలు జరుగుతుందని ఆమె కామెంట్లు చేస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని సత్వరమే ఆ సమస్యలను పరిష్కరించడానికి స్టెల్లా సతీష్ కృషి చేస్తున్నారు.
 
వృద్ధులు, వికలాంగులు తాము వైసీపీకే ఓటు వేస్తామని చెబుతున్నారని ఆమె కామెంట్లు చేశారు. కోడుమూరు నియోజకవర్గానికి సేవ చేయడమే మా కుటుంబ లక్ష్యమంటూ ఆమె ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను సతీష్ ఎమ్మెల్యే అయిన వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తామని స్టెల్లా సతీష్ హామీలు ఇవ్వడం గమనార్హం.
 
కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు పూర్తిస్థాయిలో ఆదిమూలపు సతీష్ కు మద్దతు ఇస్తుండటం ప్లస్ అవుతోంది. జగన్ అమలు చేసిన నవరత్నాల పథకాల ద్వారా భారీ స్థాయిలో లబ్ధి పొందిన నియోజకవర్గాలలో కోడుమూరు ఒకటి కావడం గమనార్హం. సర్వేలు ఆదిమూలపు సతీష్ కే అనుకూలంగా ఉన్నా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, ఆయన కుటుంబ సభ్యులు భారీ స్థాయిలో ప్రచారం చేస్తూ ఎన్నికల్లో గెలుపు కోసం తమ వంతు కష్టపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీకే ఎడ్జ్ ఉన్నా టీడీపీ అభ్యర్థి దస్తగిరి, కార్యకర్తలను తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. కోడుమూరులో ఏ పార్టీ జెండా ఎగురుతుందో తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>