PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bugganae8cc4ddf-2cde-4ef6-bb23-e194da8a131d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bugganae8cc4ddf-2cde-4ef6-bb23-e194da8a131d-415x250-IndiaHerald.jpgఏపీలోని కర్నూల్ జిల్లాలో డోన్ (ద్రోణాచలం) నియోజకవర్గం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సుదీర్ఘ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన రెండు కుటుంబాలు ఇక్కడ వైసీపీ, టీడీపీ నుంచి పోటీ పడుతున్నాయి. రాష్ట్రపతి, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులను అందించిన ఘనత ఈ నియోజకవర్గానికి ఉంది. ఇక్కడి నుంచి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాbuggana{#}Kotla Jayasurya Prakasha Reddy;Kotla Sujathamma;K E Krishnamurthy;Buggana Rajendranath Reddy;Prasthanam;Backward Classes;Husband;Wife;surya sivakumar;Minister;CBN;Congress;TDP;central government;CM;Reddy;YCPభర్త విజయాన్ని భుజాలపై వేసుకున్న మహిళ.. ఆమె వ్యూహాలు ఫలించినట్లేనా?భర్త విజయాన్ని భుజాలపై వేసుకున్న మహిళ.. ఆమె వ్యూహాలు ఫలించినట్లేనా?buggana{#}Kotla Jayasurya Prakasha Reddy;Kotla Sujathamma;K E Krishnamurthy;Buggana Rajendranath Reddy;Prasthanam;Backward Classes;Husband;Wife;surya sivakumar;Minister;CBN;Congress;TDP;central government;CM;Reddy;YCPSat, 27 Apr 2024 13:36:03 GMTఏపీలోని కర్నూల్ జిల్లాలో డోన్ (ద్రోణాచలం) నియోజకవర్గం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సుదీర్ఘ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన రెండు కుటుంబాలు ఇక్కడ వైసీపీ, టీడీపీ నుంచి పోటీ పడుతున్నాయి. రాష్ట్రపతి, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులను అందించిన ఘనత ఈ నియోజకవర్గానికి ఉంది. ఇక్కడి నుంచి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి వైసీపీ నుంచి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ పడుతున్నారు. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని రాజేంద్ర నాథ్ రెడ్డి భావిస్తున్నారు. ఇక్కడ గెలిచి తమ కుటుంబ పట్టు నిలుపుకోవాలని సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తహతహలాడుతున్నారు. ఈ రెండు కుటుంబాలకు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాష్‌కు అదనపు బలాలు ఉన్నాయి. ముఖ్యంగా ఓ మహిళ ఇక్కడి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. ఆమె ఎవరో కాదు కోట్ల సూర్య ప్రకాష్ భార్య కోట్ల సుజాతమ్మ.

గతంలో కోట్ల కుటుంబం మొత్తం కాంగ్రెస్‌లో ఉండేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత కోట్ల కుటుంబం టీడీపీలో చేరింది. 2019లో కోట్ల సుజాతమ్మ ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు నుంచి ఎంపీగా టీడీపీ నుంచి నిలబడ్డారు. అయితే ఆ ఎన్నికల్లో వారు పరాజయం పాలయ్యారు. అయితే నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ, వారికి అండగా కోట్ల సుజాతమ్మ నిలబడేవారు. ఇక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని డోన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే అక్కడ బలమైన బీసీ నేతలు కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రతాప్ కుటుంబాలు కోట్ల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. దీంతో బీసీల బలం ఆయనకు లభించనుంది. అంతేకాకుండా ప్రజల్లో మనిషిగా కలిసిపోయే కోట్ల సుజాతమ్మ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. భర్త విజయం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. తాము నియోజకవర్గంలో చేసిన మంచి, అభివృద్ధి తమను గెలిపిస్తాయని ఆమె నమ్ముతున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి వైసీపీ వెళ్లిన నాయకులు, కార్యకర్తలందరినీ తమ వైపు తిప్పుకోవడంలో ఆమె సఫలం అయ్యారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి గుబులు పుట్టిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>