PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan884ffce5-dc58-4cf8-ab9e-0116b8fd6a96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan884ffce5-dc58-4cf8-ab9e-0116b8fd6a96-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం వైఎస్ జగన్ గత ఐదేళ్లలో ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇచ్చిన హామీలలో సీపీఎస్ రద్దు, ప్రత్యేక హోదా, మధ్యపాన నిషేధం లాంటి కొన్ని హామీలను మాత్రం కొన్ని సమస్యల వల్ల జగన్ అమలు చేయలేకపోయారు. మరికొన్ని గంటల్లో జగన్ మేనిఫెస్టోను ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే రుణమాఫీ లాంటి హామీలు మాత్రం ఉండవని తెలుస్తోంది. jagan{#}Elections;Telangana Chief Minister;CM;CBN;war;Andhra Pradesh;Jagan;YCPజగన్ వర్సెస్ బాబు.. సంక్షేమ పథకాల అమలు విషయంలో బాబును నమ్మొచ్చా?జగన్ వర్సెస్ బాబు.. సంక్షేమ పథకాల అమలు విషయంలో బాబును నమ్మొచ్చా?jagan{#}Elections;Telangana Chief Minister;CM;CBN;war;Andhra Pradesh;Jagan;YCPSat, 27 Apr 2024 09:10:00 GMTఏపీ సీఎం వైఎస్ జగన్ గత ఐదేళ్లలో ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇచ్చిన హామీలలో సీపీఎస్ రద్దు, ప్రత్యేక హోదా, మధ్యపాన నిషేధం లాంటి కొన్ని హామీలను మాత్రం కొన్ని సమస్యల వల్ల జగన్ అమలు చేయలేకపోయారు. మరికొన్ని గంటల్లో జగన్ మేనిఫెస్టోను ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే రుణమాఫీ లాంటి హామీలు మాత్రం ఉండవని తెలుస్తోంది.
 
నవరత్నాల అమలుతో పాటు ఏపీ అభివృద్ధి కోసం కొన్ని పథకాలను, రైతులకు ప్రయోజనం చేకూరేలా కొన్ని పథకాలను జగన్ ప్రకటించనున్నారని తెలుస్తోంది. మరి ఇష్టానుసారం హామీలను ప్రకటిస్తున్న చంద్రబాబు నాయుడును సంక్షేమ పథకాల అమలు విషయంలో నమ్మొచ్చా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు హామీలను అమలు చేసినా చివరి ఏడాది మాత్రమే అమలు చేస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
సంక్షేమ పథకాల అమలు విషయంలో చంద్రబాబు రూట్ వేరని జగన్ రూట్ వేరని కూటమి అధికారంలోకి వచ్చినా వైసీపీ స్థాయిలో పథకాల అమలు ఆచరణ సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రస్తుతం అధికారమే లక్ష్యంగా పదుల సంఖ్యలో హామీలను ప్రకటిస్తున్నా వాస్తవాలు అర్థం కావాలంటే కొంతమేర సమయం పడుతుందని బాబు హామీల అమలు కోసం లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కేటాయించాల్సి ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
చంద్రబాబు, జగన్ లలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇద్దరికీ ఉందని ఈ ఎన్నికలు ఇరు పార్టీల నేతలకు టగ్ ఆఫ్ వార్ అనేలా ఉండబోతున్నాయని తెలుస్తోంది. జనం ఏ నేతను నమ్ముతారో ఏ నేతకు మద్దతు ఇస్తారో మాత్రం ఇప్పుడే చెప్పలేము. ఓటర్ల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి గెలుస్తుందో వైసీపీ గెలుస్తుందో చూడాలి. ఈ ఎన్నికల్లో ఓటమిపాలైతే ఆయా నేతల రాజకీయ పార్టీల భవిష్యత్తుకే ప్రమాదమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>