PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/cm-rameshb2e70ac6-cc29-4e9e-baca-b8220a88ddda-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/cm-rameshb2e70ac6-cc29-4e9e-baca-b8220a88ddda-415x250-IndiaHerald.jpgఎక్కడో కడప జిల్లా నుంచి వచ్చిన సీఎం రమేశ్ బలమేంటో ఆయన రాజకీయమేంటో అన్నది అనకాపల్లి వాసులు ప్రత్యక్షంగా చూస్తున్నారు. సీఎం రమేశ్ రాజకీయ చక్రం గిర్రున తిరుగుతుంది. లోకల్ నుంచి దిల్లీ దాకా అందరితో ఆయనకు ఉన్న పరిచయాలుచూసిన వారు అంగబలం అర్థబలం ఉన్న నేత అంటే ఆయనే అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే సీఎం రమేశ్ సీఎం జగన్ కి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. వైఎస్ వివేకానందా రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించేందుకు తెర వెనుక గట్టిగా ప్రయత్నించిన వ్యక్తి సీఎం రమేశ్ అని ఇప్పటికి పలువురు పేర్కొంటూ ఉంటారు. తప్పcm ramesh{#}C M Ramesh;Anakapalle;Cheque;Chakram;Shakti;Pawan Kalyan;kadapa;local language;Andhra Pradesh;Prime Minister;Jagan;Party;Minister;TDPసీఎం రమేష్‌: దిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతూ చుక్కలు చూపిస్తున్నాడుగా?సీఎం రమేష్‌: దిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతూ చుక్కలు చూపిస్తున్నాడుగా?cm ramesh{#}C M Ramesh;Anakapalle;Cheque;Chakram;Shakti;Pawan Kalyan;kadapa;local language;Andhra Pradesh;Prime Minister;Jagan;Party;Minister;TDPSat, 27 Apr 2024 09:21:06 GMTఎక్కడో కడప జిల్లా నుంచి వచ్చిన సీఎం రమేశ్ బలమేంటో ఆయన రాజకీయమేంటో అన్నది అనకాపల్లి వాసులు ప్రత్యక్షంగా చూస్తున్నారు. సీఎం రమేశ్ రాజకీయ చక్రం గిర్రున తిరుగుతుంది. లోకల్ నుంచి దిల్లీ దాకా అందరితో ఆయనకు ఉన్న పరిచయాలుచూసిన వారు అంగబలం అర్థబలం ఉన్న నేత అంటే ఆయనే అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే సీఎం రమేశ్ సీఎం జగన్ కి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. వైఎస్ వివేకానందా రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించేందుకు తెర వెనుక గట్టిగా ప్రయత్నించిన వ్యక్తి సీఎం రమేశ్ అని ఇప్పటికి పలువురు పేర్కొంటూ ఉంటారు.


తప్పని పరిస్థితుల్లో టీడీపీ నుంచి బీజేపీలోకి పార్టీ మారినా ఆయన మూలాలన్నీ టీడీపీలోనే ఉన్నాయి. ఏ పార్టీలో ఉన్నా జగన్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా.. చంద్రబాబుకి మేలు చేకూర్చేవిధంగా పనిచేస్తున్నారు. ప్రధాని మోదీకి జగన్ అంటే ఒక రకమైన గౌరవం. కాకపోతే ఇద్దరి మధ్య సఖ్యత లేకుండా చేసేందుకు సీఎం రమేశ్ పాత్ర అమోఘం. ఎన్డీయే కూటమిలోకి టీడీపీని తీసుకువచ్చేందకు కూడా తన శక్తి మేర కృషి చేశారు. చివరకు అనుకున్నది సాధించగలిగారు.


అనకాపల్లి ఎంపీ సీటు ఇచ్చిన సమయంలోను ఇక్కడ టీడీపీ నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. మా పార్టీ అభ్యర్థే అనే తరహాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు ఏ రాజకీయ నాయకులు వచ్చిన కూడా తొలి కార్యక్రమం అనకాపల్లిలోనే పెట్టిస్తున్నారు. మొన్న చంద్రబాబు,  పవన్ కల్యాణ్ సభలు ఇక్కడే పెట్టించారు.


తర్వాత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏపీ పర్యటనలోను తన నియోజకవర్గంలోనే రోడ్ షో జరిగేలా ప్రణాళికలు రచించారు. ఏపీలో ప్రధాని పర్యటన పరిమితంగానే ఉంది. ఇలాంటి సమయంలోను తన అనకాపల్లి లోక్ సభ సెగ్మెంట్ లో ప్రధాని సభ ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం మీద తాను గెలిచి జగన్ కు చెక్ పెట్టాలని భావిస్తున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>