HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/rice-eating-healthd12ff1c2-9d32-476f-a9c9-baa7fc8ddc88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/rice-eating-healthd12ff1c2-9d32-476f-a9c9-baa7fc8ddc88-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలా మంది ఒక నెలకు సరిపడు సరుకులను మాత్రమే తీసుకుంటూ ఉంటున్నారు. ముఖ్యంగా రైస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తూ ఉన్నారు. కేవలం 25 కేజీలు 30 కేజీల రైస్ బ్యాగులను మాత్రమే తెచ్చుకుంటున్నారు. ఇంతకంటే ఎక్కువ మోతాదులో తెచ్చుకుంటే ఖచ్చితంగా పురుగులు పట్టేందుకు అవకాశం ఉన్నది.. కానీ పల్లెలలో నివసించే చాలామంది ఏడాదికి సరిపడు బియ్యాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. దీంతో పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో ఆ బియ్యాన్ని వండేటప్పుడు చెరిగిమరి పురుగులను తీసివేసి వండుకుంటూ ఉంటారRICE;EATING;HEALTH{#}Neem;oilపురుగు పట్టిన బియ్యన్ని వండుతున్నారా.. ఇది తెలుసుకోండి..?పురుగు పట్టిన బియ్యన్ని వండుతున్నారా.. ఇది తెలుసుకోండి..?RICE;EATING;HEALTH{#}Neem;oilSat, 27 Apr 2024 06:00:00 GMTప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలా మంది ఒక నెలకు సరిపడు సరుకులను మాత్రమే తీసుకుంటూ ఉంటున్నారు. ముఖ్యంగా రైస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తూ ఉన్నారు. కేవలం 25 కేజీలు 30 కేజీల రైస్ బ్యాగులను మాత్రమే తెచ్చుకుంటున్నారు. ఇంతకంటే ఎక్కువ మోతాదులో తెచ్చుకుంటే ఖచ్చితంగా పురుగులు పట్టేందుకు అవకాశం ఉన్నది.. కానీ పల్లెలలో నివసించే చాలామంది ఏడాదికి సరిపడు బియ్యాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. దీంతో పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమయంలో ఆ బియ్యాన్ని వండేటప్పుడు చెరిగిమరి పురుగులను తీసివేసి వండుకుంటూ ఉంటారు.


ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం నిల్వ ఉంచిన బియ్యానికి ఎక్కువగా ముగ్గు పురుగులు, ముసిపురుగులు, లబ్ది పురుగులు వంటివి పడతాయట. అలా పట్టిన బియ్యాన్ని చెరిగి అన్నం వండి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అన్నం వండేటప్పుడు కచ్చితంగా ప్రతి ఒక్కరు బియ్యాన్ని నీటితో కడుగుతూ ఉంటారు. ఆ తర్వాత బియ్యం అన్నంగా మారడానికి ఉడక పెడుతూ ఉంటాము. ఆ వేడికి బియ్యంలో ఏదైనా బ్యాక్టీరియా కీటక వ్యర్ధాలు అంటూ ఉన్న అవి మరణిస్తాయట. అందుచేతనే ఎలాంటి బియ్యాన్ని తిన్న పెద్దగా ఎఫెక్ట్ ఉండదని నిపుణులు తెలియజేస్తున్నారు.


బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలి అంటే గతంలో ఎక్కువగా వేపాకు కలిపి సంచులలో నింపేవారు.. అయితే ఈమధ్య బోరిక్ పౌడర్, ఆముదం నూనె వంటివి కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. లేకపోతే ఏవైనా డబ్బాలలో బియ్యాన్ని ఉంచుతూ ఉన్నారు. బియ్యాన్ని నిల్వ ఉంచే ప్రాంతాలలో ఎండుమిర్చి, లవంగాలు, వెల్లుల్లిపాయలు వంటివి ఉంచడం వల్ల వాటి వాసనకు పురుగులు సైతం దరి చేరవని నిపుణులు తెలియజేస్తున్నారు. బిర్యానీ ఆకులను కూడా బియ్యంలో కలపడం వల్ల ఎలాంటి పురుగులు దరి చేరవని నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. మరి పురుగు పట్టిన బియ్యంతో విసిగిపోయేవారు ఈ పద్ధతులను పాటించడం మంచిది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>