PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-siddam-sabha-ycp-cbn-tdp95a3d43a-d330-4c78-93c4-9995f3f5817d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-siddam-sabha-ycp-cbn-tdp95a3d43a-d330-4c78-93c4-9995f3f5817d-415x250-IndiaHerald.jpgఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొలది ఆంధ్రప్రదేశ్ నాయకులు ప్రచార స్పీడ్ పెంచారు. ఈ ఉన్న టైంలోనే ప్రజలందరినీ ప్రసన్నం చేసుకునేందుకు దూసుకుపోతున్నారు. అలాంటి ఈ తరుణంలో టిడిపి కూటమి రాష్ట్రమంతా వర్గాలుగా విడిపోయి ప్రచారంలో మునిగిపోతూ ఉంటే వైసిపి మాత్రం సింహం సింగిల్ గా వస్తుందంటూ తాను ఒక్కడే సిద్ధం అనే పేరుతో సభలు నిర్వహిస్తూ రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. మొన్నటి వరకు బస్సుయాత్ర చేసి రాష్ట్రమంతా సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారి అభ్యర్థులను ప్రకటిస్తూ వారికి ఓటు వేయాలని ప్రాధేపడ్డాడు. jagan;siddam sabha;ycp;cbn;tdp{#}Yatra;bus;Evening;lion;Andhra Pradesh;TDP;YCP;Jagan;Parliamentఏపీ:జగన్ మరో యాత్రకు సిద్ధం.. ఇది మాములుగా ఉండదట..!ఏపీ:జగన్ మరో యాత్రకు సిద్ధం.. ఇది మాములుగా ఉండదట..!jagan;siddam sabha;ycp;cbn;tdp{#}Yatra;bus;Evening;lion;Andhra Pradesh;TDP;YCP;Jagan;ParliamentSat, 27 Apr 2024 19:57:41 GMTఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొలది  ఆంధ్రప్రదేశ్ నాయకులు ప్రచార స్పీడ్ పెంచారు. ఈ ఉన్న టైంలోనే   ప్రజలందరినీ ప్రసన్నం చేసుకునేందుకు దూసుకుపోతున్నారు. అలాంటి ఈ తరుణంలో  టిడిపి కూటమి రాష్ట్రమంతా వర్గాలుగా విడిపోయి ప్రచారంలో మునిగిపోతూ ఉంటే  వైసిపి మాత్రం  సింహం సింగిల్ గా వస్తుందంటూ తాను ఒక్కడే  సిద్ధం అనే పేరుతో సభలు నిర్వహిస్తూ రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. మొన్నటి వరకు బస్సుయాత్ర చేసి రాష్ట్రమంతా సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ వారి అభ్యర్థులను ప్రకటిస్తూ వారికి ఓటు వేయాలని ప్రాధే పడ్డాడు. 

ఇప్పటికే రెండుసార్లు  రాష్ట్రమంతా పర్యటనలు నిర్వహించి  వైసిపి నాయ కుల్లో కార్యకర్తల్లో ఊపు తీసుకొచ్చారు. ఇక ఎన్నికల సమయానికి దాదాపుగా 15 రోజులు మాత్రమే ఉంది. ఈ సమయంలో జగన్ రాష్ట్రమంతా మరో మారు పర్యటన చేయాలనుకుంటున్నారట. దీని కోసం ఆయన అద్భుతమైన ప్లాన్ రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసు కుందాం.. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. 175 నియోజకవర్గాల్లో, 25 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులంతా నామినేషన్లు వేశారు. ఇప్పటివరకు ప్రచారం చేసింది ఒక లెక్క ఇప్పుడు చేసే ప్రచారం మరో లెక్క. 

ఇప్పటికే జగన్ సిద్ధం సభలు, మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రతో ప్రజలందరినీ కలిశారు. అయితే ఆయన త్వరలో మూడవసారి హెలిక్యాప్టర్ యాత్ర ప్రారంభించ నున్నారు. దీనిలో భాగంగా రోజుకు మూడు లేదా నాలుగు బహిరంగ సభలు పాల్గొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట.ఉదయం 11 గంటలకు ఒకటి, మధ్యాహ్నం 1, మరియు 3 గంటలకు,  సాయంత్రం 5 గంటలకు ఇలా రోజులో నాలుగు బహిరంగ సభలో  పాల్గొని కొత్త ప్రచారానికి సై అంటూ వెళ్తున్నారట. ఈ విధంగా జగన్ సింగిల్ గా  మూడుసార్లు యాత్ర చేస్తుండడంతో టిడిపి కూటమి గుండెల్లో రైళ్లు పరిగెడు తున్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>