PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayachoti-gadikota-sreekanth-reddy-tdp-ramprased-reddy-politics3ccb52ed-1e29-4564-82b6-13afb8790a38-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayachoti-gadikota-sreekanth-reddy-tdp-ramprased-reddy-politics3ccb52ed-1e29-4564-82b6-13afb8790a38-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రాంత నియోజకవర్గంలలో రాజకీయాలు ఎప్పుడు రసవత్తంగానే కొనసాగుతూ ఉంటాయి. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నది ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.. 2009లో కాంగ్రెస్ తరపున వైయస్సార్ సహాయంతో పోటీ చేసి.. ఆ తర్వాత 2012, 14,19 ఎన్నికలలో గెలుస్తూనే వస్తున్నారు.. దీంతో రాయచోటి అంటే కచ్చితంగా గడికోట అనే స్థాయికి వశిష్టం చేసుకున్నారు శ్రీకాంత్ రెడ్డి. వరుసగా నాలుగు సార్లు విజయాన్ని అందుకున్న శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఐదవ సారి మళ్ళీRAYACHOTI;GADIKOTA SREEKANTH REDDY;TDP;RAMPRASED REDDY;POLITICS{#}Bharatiya Janata Party;Janasena;Balija;రాజీనామా;MLA;Reddy;Annamayya;Rayachoty;Party;srikanth;Father;Jagan;Congress;kadapa;politics;TDP;YCPరాయలసీమ: వైసిపి కంచుకోటపై టిడిపి ప్లాన్..!రాయలసీమ: వైసిపి కంచుకోటపై టిడిపి ప్లాన్..!RAYACHOTI;GADIKOTA SREEKANTH REDDY;TDP;RAMPRASED REDDY;POLITICS{#}Bharatiya Janata Party;Janasena;Balija;రాజీనామా;MLA;Reddy;Annamayya;Rayachoty;Party;srikanth;Father;Jagan;Congress;kadapa;politics;TDP;YCPSat, 27 Apr 2024 07:04:23 GMTఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రాంత నియోజకవర్గంలలో రాజకీయాలు ఎప్పుడు రసవత్తంగానే కొనసాగుతూ ఉంటాయి. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి నియోజవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నది ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి.. 2009లో కాంగ్రెస్ తరపున వైయస్సార్ సహాయంతో పోటీ చేసి.. ఆ తర్వాత 2012, 14,19 ఎన్నికలలో గెలుస్తూనే వస్తున్నారు.. దీంతో రాయచోటి అంటే కచ్చితంగా గడికోట అనే స్థాయికి వశిష్టం చేసుకున్నారు శ్రీకాంత్ రెడ్డి. వరుసగా నాలుగు సార్లు విజయాన్ని అందుకున్న శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఐదవ సారి మళ్ళీ వైయస్సార్ పార్టీ నుంచి బరిలోకి దిగిపోతున్నారు.


అయితే ఈసారి గడికోటను బద్దలు కొట్టాలి అంటే సరైన ప్రత్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని టిడిపి పార్టీ దింపింది.ఈయన తండ్రి 1985, 89 ఎన్నికలలో రాయచోటి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు..94 లో రాంప్రసాద్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ తర్వాత మళ్లీ ఇటీవలే పార్టీలోకి వచ్చిన రాంప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో అక్కడ కొంతమంది నేతలలో చాలా వ్యతిరేకత కనిపిస్తోంది. 2009లో కాంగ్రెస్ నుంచి నిలబడ్డ శ్రీకాంత్ రెడ్డి సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు మీద 14 వేలకు పైగా అత్యధిక విజయంతో గెలిచారు.


వైయస్సార్ మరణం తర్వాత 2012లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ కి మద్దతుగా నిలిచి ఉప ఎన్నికలలో వైసిపి తరఫున పోటీ చేయగా అత్యధికంగా 56,931 ఓట్లతో భారీ ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వరుస గా అత్యధిక ఓట్లతోనే గెలుస్తూ వచ్చారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. వైయస్ జగన్ కు ఏపీలో అత్యంత సన్నిహితుడుగా నిలిచారు శ్రీకాంత్ రెడ్డి. అయితే ఈసారి ఎన్నికలలో కూడా శ్రీకాంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని అటు టిడిపి జనసేన బిజెపి పార్టీలు మూకుమ్మడిగా ప్రయత్నిస్తున్నాయి. జనసేన పార్టీ కూడా కలవడంతో అక్కడ బలిజ ఓట్లు అధికంగా ఉన్నప్పటికీ ఇద్దరు కూడా రెడ్లు నిలబడుతూ ఉండడంతో అక్కడ ఈ ఓట్లు కీలకంగా మారనున్నాయి. దీంతో టీడీపీ మాత్రం జనసేన పార్టీ తమతో ఉందని బలిజ ఓట్లు కూడా తమకే దక్కుతాయని ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ రాయచోటిలో గడికోట బద్దలవుతుందా లేదా అనే విషయం తెలియాలి అంటే ఎన్నికల ఫలితాల దాకా ఆగాల్సిందే..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>