PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpab41482c-4d4e-47bd-b9ef-71a898957f7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpab41482c-4d4e-47bd-b9ef-71a898957f7c-415x250-IndiaHerald.jpgఏపీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2019 ఎన్నికల సమయంలో పాదయాత్ర అంటూ నెలల పాటు ప్రజలతో మమేకం అయిన వైఎస్ జగన్.. ఇప్పుడు ముఖ్య మంత్రి హోదాలోను 2024 ఎన్నికల ముందు సుమారు నెల రోజుల పాటు సిద్ధం, మేమంతా సిద్ధం అంటూ ప్రజల్లోనే ఉన్నారు. ఈ సమయంలో టీడీపీ అభ్యర్థుల్లో కాన్ఫెడెన్స్ కొరవడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అవును ఏపీ రాజకీయాలపై సిద్ధం సభలకు ముందు వరtdp{#}Lavu Sri Krishna Devarayalu;Survey;Press;Narsapuram;Avunu;Telangana Chief Minister;CM;bus;Andhra Pradesh;Jagan;YCP;Bharatiya Janata Party;Party;Hanu Raghavapudi;TDPఓటమి ముందే ఒప్పేసుకున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి?ఓటమి ముందే ఒప్పేసుకున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి?tdp{#}Lavu Sri Krishna Devarayalu;Survey;Press;Narsapuram;Avunu;Telangana Chief Minister;CM;bus;Andhra Pradesh;Jagan;YCP;Bharatiya Janata Party;Party;Hanu Raghavapudi;TDPSat, 27 Apr 2024 09:16:00 GMTఏపీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2019 ఎన్నికల సమయంలో పాదయాత్ర అంటూ నెలల పాటు ప్రజలతో మమేకం అయిన వైఎస్ జగన్.. ఇప్పుడు ముఖ్య మంత్రి హోదాలోను 2024 ఎన్నికల ముందు సుమారు నెల రోజుల పాటు సిద్ధం, మేమంతా సిద్ధం అంటూ ప్రజల్లోనే ఉన్నారు. ఈ సమయంలో టీడీపీ అభ్యర్థుల్లో కాన్ఫెడెన్స్ కొరవడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.


అవును ఏపీ రాజకీయాలపై సిద్ధం సభలకు ముందు వరకు మిక్స్డ్ అనాలసిస్, సర్వే ఫలితాలు, చర్చలు వచ్చాయి. ఎప్పుడైతే జగన్ సిద్ధం అంటూ కార్యకర్తలతో బహిరంగ సభలు నిర్వహించారో నాటి నుంచి లెక్కలు మారిపోయాయి. ఇదే సమయంలో మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రతో అన్ని లోక్ సభ నియోజకవర్గాలు ప్రజలతో మమేకం అవుతూ తిరగడం మరింతగా వారికి ప్లస్ అయింది.


ఇదిలా ఉండగా తాజాగా టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గత ఎన్నికల్లో వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీ గా గెలుపొందారు. ఈసారి వైసీపీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో టీడీపీ లో చేరి ఆ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. తాజాగా ఆయన ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాలంటే చాలా కష్టపడాలి ఉంటుందని చెప్పుకొచ్చారు. టీడీపీ గెలుపు అంత సులభం కాదని తేల్చి చెప్పారు.


ఎన్డీయే కూటమి లో చేరడం వల్ల టీడీపీ కి పెద్ద మేలు జరిగింది ఏదీ లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ మాతో జత కట్టింది కానీ దానివల్ల ప్రయోజనం పొందలేకపోయిందని ఆయన తెలిపారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొందని వైసీపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. వారికి గెలుపుపై నమ్మకం లేదని చెబుతున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>