PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-guntur-west-satula5b0917b4-dd51-4ac6-9102-767d6ee4465e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-guntur-west-satula5b0917b4-dd51-4ac6-9102-767d6ee4465e-415x250-IndiaHerald.jpg- మంత్రి ర‌జ‌నీ గెలుపుకోసం కుమార‌స్వామి ప్లానింగ్‌ - భార్య మాధ‌వి కోసం భ‌ర్త రామ‌చంద్ర వ్యూహాలు - భార్య‌ల కోసం భ‌ర్త‌ల ప్లానింగ్‌తో ర‌క్తి క‌డుతోన్న రాజ‌కీయం ( గుంటూరు - ఇండియా హెరాల్డ్ ) ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోరు అనేది చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే 175 నియోజకవర్గాలు 25 పార్లమెంటు స్థానాలలో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అభ్యర్థులంతా ప్రచారంలో పోతున్నారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో కేవలం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా పAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; Guntur West; Satula{#}Kamma;Backward Classes;local language;Guntur;YCP;Wife;Lokesh;Lokesh Kanagaraj;Minister;Husband;Andhra Pradesh;Sharmila;Parliament;madhavi;TDP;Indiaగుంటూరు వెస్ట్: సతుల‌ కోసం పతుల‌ ఆరాటం..!గుంటూరు వెస్ట్: సతుల‌ కోసం పతుల‌ ఆరాటం..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; Guntur West; Satula{#}Kamma;Backward Classes;local language;Guntur;YCP;Wife;Lokesh;Lokesh Kanagaraj;Minister;Husband;Andhra Pradesh;Sharmila;Parliament;madhavi;TDP;IndiaSat, 27 Apr 2024 08:20:39 GMT- మంత్రి ర‌జ‌నీ గెలుపుకోసం కుమార‌స్వామి ప్లానింగ్‌
- భార్య మాధ‌వి కోసం భ‌ర్త రామ‌చంద్ర వ్యూహాలు
- భార్య‌ల కోసం భ‌ర్త‌ల ప్లానింగ్‌తో ర‌క్తి క‌డుతోన్న రాజ‌కీయం

( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )

 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోరు అనేది చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే 175 నియోజకవర్గాలు 25 పార్లమెంటు స్థానాలలో  అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అభ్యర్థులంతా ప్రచారంలో పోతున్నారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో  కేవలం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా పులివెందులలో వైఎస్ భారతి, కుప్పంలో నారా భువనేశ్వరి, మంగళగిరిలో లోకేష్ మరియు ఆయన భార్య బ్రాహ్మణి, అంతేకాకుండా షర్మిల ఇలా పతుల కోసం సతులు ప్రచారంలో పాల్గొంటూ ఈ ఎన్నికల్లో వారి భర్తలను గెలిపించాలని ప్రాధేయ పడుతున్నారు.

ఇదే తరుణంలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో  సతుల కోసం పతులు పాటు పడుతున్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి విడదల రజిని వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా టిడిపి నుంచి  గల్లా మాధవి బరిలో ఉంది.  రజిని ఇప్పటికే రాజకీయ అనుభవం ఉన్న నాయకురాలు ఆమె ప్రచారంలో ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఓ చుట్టు చుట్టేసింది.  కానీ గల్లా మాధవి మాత్రం రాజకీయాలకు కొత్త కాబట్టి ఆమె కోసం ఆయన భర్త రామచంద్ర  ప్రచారంలో మునిగిపోతున్నారు. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం..

మాధవికి బలం :
 గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటివరకు టిడిపి పార్టీ ఎక్కువసార్లు గెలిచింది. అంతేకాకుండా టిడిపి పై చేయి సాధిస్తుందని చాలామంది భావిస్తున్నారు. అయితే మాధవి గెలవడానికి ప్రధాన కారణం సామాజిక వర్గాల ఓట్లు. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాపు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు గెలిచారు. ఈసారి బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు మరియు మహిళలు కావడంతో రాజకీయం చాలా రంజుగా సాగుతోంది. ముఖ్యంగా గల్లా మాధవి రజక సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు.  ఆమె భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.

ఈ క్రమంలో  బీసీ సామాజిక వర్గ ఓట్లు,కమ్మ సామాజిక వర్గ ఓట్లు  పూర్తిస్థాయిలో మాధవికి పడే అవకాశం ఉంది. అంతే కాకుండా మాధవి కూడా వికాస్ హాస్పిటల్స్ పేరుతో ఎంతో గుర్తింపు సాధించింది. ప్రజలకు ఎన్నో సేవలు అందించింది.  ఇక తన భర్త రామచంద్ర రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అగ్ర గన్యుడు. నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన కూడా మంచి  గుర్తింపు సాధించారు. అన్ని ఈక్వేషన్స్ గల్లా మాధవి వైపు ఉండడం లోకల్ కావడం,  మరీ ముఖ్యంగా మహిళ అవ్వడంతో ఈసారి మాధవి మంత్రి ర‌జ‌నీకి గ‌ట్టిపోటీ దారు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>