Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/elextions0bff7afb-7f16-4680-a4f8-731fb643683d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/elextions0bff7afb-7f16-4680-a4f8-731fb643683d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఓటర్ల పండుగ కొనసాగుతుంది. ఏకంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు బిజీ బిజీగా మారిపోయాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులు ఇక ప్రచార రంగంలో దూసుకుపోతూ హామీల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి. అయితే కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే పోలింగ్ జరుగుతూ ఉండగా మరికొన్ని రాష్ట్రాలలో ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. సాదరణంగా ఇలా నామినేషన్లు వేస్తున్న సమయంలో తమ ఆస్తులు అప్పులకు సంబంధించిన పూర్తి వివరాలతో అపడవిట్లను కూడా సమర్పిElextions{#}bhanu;lakshman;prudhvi raj;Amaravati;festival;Varsham;Election Commission;Parliment;Suresh;MP;MLA;Congressఈ ఎలక్షన్స్ లో.. నిరుపేద ఎంపీ అభ్యర్థులు వీళ్లే?ఈ ఎలక్షన్స్ లో.. నిరుపేద ఎంపీ అభ్యర్థులు వీళ్లే?Elextions{#}bhanu;lakshman;prudhvi raj;Amaravati;festival;Varsham;Election Commission;Parliment;Suresh;MP;MLA;CongressSat, 27 Apr 2024 14:30:00 GMTప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఓటర్ల పండుగ కొనసాగుతుంది. ఏకంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు బిజీ బిజీగా మారిపోయాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులు ఇక ప్రచార రంగంలో దూసుకుపోతూ హామీల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి. అయితే కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే పోలింగ్ జరుగుతూ ఉండగా మరికొన్ని రాష్ట్రాలలో ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. సాదరణంగా ఇలా నామినేషన్లు వేస్తున్న సమయంలో తమ ఆస్తులు అప్పులకు సంబంధించిన పూర్తి వివరాలతో అపడవిట్లను కూడా సమర్పించడం చేస్తూ ఉంటారు ఆయా పార్టీలు అభ్యర్థులు.



 ఈ క్రమంలోనే ఇటీవల అభ్యర్థుల ఎలక్షన్ అపడవిట్లపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్, రీఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాచ్ విశ్లేషణ చేసింది. కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు వెంకటరమణ రెండోదశ పోలింగ్లో అత్యంత ధనవంతుడు అయిన అభ్యర్థి అన్న విషయాన్ని ఎలక్షన్ కమిషన్ తేల్చింది. హెచ్ డి కుమారస్వామి పై పోటీ చేస్తున్న వెంకటరమణ గౌడ 622 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నట్లు అపడవిట్లో పేర్కొన్నారు. ఇక కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ రెండు అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. ఏకంగా 593 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నట్లు అపడవిట్లో పేర్కొన్నారు.



 అయితే ఇలా ఎంపీ లేదా ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారి అపడవిట్లో వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి అని చూపించడం సర్వసాధారణమే. కానీ ఇక్కడ ఏకంగా ఒక నిరుపేద అభ్యర్థికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఒక స్వతంత్ర అభ్యర్థి ఆస్తి యొక్క విలువ కేవలం 500 రూపాయలు మాత్రమే నట. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లక్ష్మణ్ నాగోరావు పాటిల్ 500 రూపాయల ఆస్తులు మాత్రమే ఉన్నాయి అని ప్రకటించారు. దీంతో రెండో దశలో అత్యల్ప ఆస్తులు కలిగిన అభ్యర్థిగా ఆయన నిలిచారు. ఇక కేరళలోని కాసర గోడ్ నుంచి పోటీ చేస్తున్న మరో స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వరి కే.ఆర్ వెయ్యి రూపాయల విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు తెలిపారు. ఇక అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న పృథ్వి సామ్రాట్ ముకుందరావు దీప్ వాన్ 1400 రూపాయలు ఆస్తులు కలిగి ఉన్నాడట. రాజస్థాన్లోని జోధ్పూర్ నుంచి పోటీ చేస్తున్న సహనాజ్ భాను 2000 రూపాయల ఆస్తులు, కేరళలోని కొట్టయ్యం నుంచి పోటీ చేస్తున్న విపి కోచ్మోహన్ 2230 రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>