MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/another-box-office-flop-varun-tej-career-at-risk7241c03e-8bc0-4356-9a7a-924abe139462-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/another-box-office-flop-varun-tej-career-at-risk7241c03e-8bc0-4356-9a7a-924abe139462-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమలో టాప్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయంలోనే రాజకీయాల వైపు దృష్టిని మళ్లించి జనసేన అనే పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ పార్టీని స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీ పోటీలో లేదు. ఇక పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ పోటీలో నిలిచింది. కాకపోతే ఇందులో నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కూడా గెలపొందలేకపోయాడు. ఈ పార్టీ నుంచి మొత్తం ఒకే ఒక సభ్యుడు గెలుపొvt{#}getup srinu;AdiNarayanaReddy;mandalam;Gabbar Singh;Press;varun tej;Telugu Desam Party;Assembly;Andhra Pradesh;auto ram prasad;Jabardasth;Party;Nagababu;kalyan;Janasenaపవన్ కోసం ప్రచారంలోకి దిగనున్న వరుణ్..?పవన్ కోసం ప్రచారంలోకి దిగనున్న వరుణ్..?vt{#}getup srinu;AdiNarayanaReddy;mandalam;Gabbar Singh;Press;varun tej;Telugu Desam Party;Assembly;Andhra Pradesh;auto ram prasad;Jabardasth;Party;Nagababu;kalyan;JanasenaSat, 27 Apr 2024 12:54:29 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమలో టాప్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయంలోనే రాజకీయాల వైపు దృష్టిని మళ్లించి జనసేన అనే పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ పార్టీని స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి అసెంబ్లీ ఎన్నికలలో ఈ పార్టీ పోటీలో లేదు. ఇక పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ పోటీలో నిలిచింది. కాకపోతే ఇందులో నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కూడా గెలపొందలేకపోయాడు. ఈ పార్టీ నుంచి మొత్తం ఒకే ఒక సభ్యుడు గెలుపొందాడు.

ఇలా పోయిన ఎలక్షన్లలో జనసేన పార్టీకి పెద్ద మొత్తంలో జనాల నుండి ఆదరణ దక్కలేదు. దానితో ఈసారి మాత్రం జనసేన భారీ స్థాయిలో సీట్లను దక్కించుకోవాలి అని చూస్తుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం , జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా జనసేన పార్టీకి మొత్తం 21 సీట్లను ఇచ్చారు. ఇక జనసేన అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాడు. ఈయనకు సపోర్టుగా ఇప్పటికే జబర్దస్త్ చెందిన నటులు హైపర్ ఆది , గెటప్ శ్రీను , ఆటో రామ్ ప్రసాద్ , గబ్బర్ సింగ్ గ్యాంగ్ వంటి వారు పిఠాపురంలో ప్రచారం చేసారు.

ఇక పవన్ కళ్యాణ్ సోదరుడు అయినటువంటి నాగబాబు కూడా ఇక్కడ అనేక రోజులుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక ఆయన కుమారుడు అయినటువంటి వరుణ్ తేజ్ కూడా ప్రచారంలోకి దిగనున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గం. లకు ప్రచారం ప్రారంభించి వన్నెపూడి మీదుగా అనంతరం కొడవలి , చందుర్తి మీదుగా దుర్గాడ చేరుకుంటారు. ఆ ప్రచారంలో భాగంగా ర్యాలీ , రోడ్ షో , సమావేశాల్లో పాల్గొననున్న వరుణ్ తేజ్ , వాటిలో ప్రసంగించనున్నట్లు జనసేన తాజాగా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో తెలిపింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>