MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mahesh-babu6788afa3-829c-4cfb-b119-56124736874d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mahesh-babu6788afa3-829c-4cfb-b119-56124736874d-415x250-IndiaHerald.jpgప్రస్తుతం రీ రిలీజ్ అవుతున్న సినిమాలకి ఫ్యాన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమాతో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. తర్వాత నుంచి స్టార్ హీరోల చిత్రాలను స్పెషల్ అకేషన్స్ లో రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తెలుగులో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ తరువాత తమిళ్, మలయాళీ, కన్నడ భాషలకి కూడా వ్యాపించింది. ఇప్పటి దాకా ఇలా రీ రిలీజ్ అయిన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్ సొంతం చేసుకున్న మూవీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి కొద్ది రోజుల ముందు దాకా ఉంది. ఈ సినిమాని వారం రోజుల పైగా ఆడించడం వల్ల 7.Mahesh Babu{#}Mohanlal;gautham menon;Tarun Kumar;Simhadri;kushi;Kushi;Businessman;Pawan Kalyan;Joseph Vijay;mahesh babu;NTR;cinema theater;Rajamouli;surya sivakumar;Hero;Kannada;Cinema;Tamilరీరిలీజ్ రికార్డుల్లో నిజమైన తోపు ఆ హీరోనే?రీరిలీజ్ రికార్డుల్లో నిజమైన తోపు ఆ హీరోనే?Mahesh Babu{#}Mohanlal;gautham menon;Tarun Kumar;Simhadri;kushi;Kushi;Businessman;Pawan Kalyan;Joseph Vijay;mahesh babu;NTR;cinema theater;Rajamouli;surya sivakumar;Hero;Kannada;Cinema;TamilSat, 27 Apr 2024 16:44:14 GMTప్రస్తుతం రీ రిలీజ్ అవుతున్న సినిమాలకి ఫ్యాన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమాతో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. తర్వాత నుంచి స్టార్ హీరోల చిత్రాలను స్పెషల్ అకేషన్స్ లో రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. తెలుగులో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ తరువాత తమిళ్, మలయాళీ, కన్నడ భాషలకి కూడా వ్యాపించింది. ఇప్పటి దాకా ఇలా రీ రిలీజ్ అయిన సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్ సొంతం చేసుకున్న మూవీగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి కొద్ది రోజుల ముందు దాకా ఉంది. ఈ సినిమాని వారం రోజుల పైగా ఆడించడం వల్ల 7.46 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ సూపర్ హిట్ మూవీ గిల్లీ (ఒక్కడు రీమేక్) తొలి రోజే బ్రేక్ చేయడం విశేషం.ఎందుకంటే ఈ సినిమా ఎక్కువ థియేటర్లలో విడుదల అయ్యింది. పైగా ఓవర్ సీస్లో కూడా విడుదల చేసి ఎక్కువ రోజులు ఆడిస్తున్నారు.అందుకే ఈ రేంజ్ లో వసూళ్లు వచ్చాయి.ఐదు రోజులలో ఈ మూవీ టోటల్ గా 17.70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రీరిలీజ్ సినిమాల కలెక్షన్స్ పరంగా టాప్ లోకి దూసుకొచ్చింది.


మూడో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్ వచ్చిన సూపర్ హిట్ మూవీ బిజినెస్ మ్యాన్ సినిమా నిలిచింది. నిజానికి ఈ సినిమాని కేవలం ఒక్క రోజే ప్రదర్శించారు. అది కూడా చాలా తక్కువ థియేటర్ లలోనే ప్రదర్శించారు. అయినా కానీ ఈ సినిమా  రికార్డు స్థాయిలో 5.85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. ఒకవేళ ఈ సినిమాని కూడా గిల్లి, ఖుషి లాగే ఎక్కువ థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడించి ఉంటే ఇప్పుడు ఈ సినిమా టాప్ ప్లేసులో ఉండేది. కాబట్టి ఈ లెక్కల ప్రకారం చూస్తే పవన్, విజయ్ కన్నా మహేష్ బాబే తోపు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకో విషయం ఏమిటంటే మహేష్ సినిమాలు మూడు కూడా రీ రిలీజ్ లో కోటి పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టించాయి. పోకిరి, ఒక్కడు, బిజినెస్ మ్యాన్ మూడు కూడా రికార్డ్ వసూళ్లనే రాబట్టాయి. మిగతా హీరోలకి ఈ రికార్డ్ లేదు.


ఇక ఈ రీ రిలీజ్ సినిమాల కలెక్షన్స్ లో నాలుగో స్థానంలో 4.90 కోట్ల గ్రాస్ తో మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ స్పదికం ఉంది. 5 వ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో చేసిన సింహాద్రి ఉండటం గమనార్హం. ఈ మూవీ 4.60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది మూవీ 3.52 కోట్ల గ్రాస్ తో ఆరో స్థానంలో సాధించింది. ఈ చిత్రానికి ఫస్ట్ రిలీజ్ లో కూడా ఈ స్థాయి కలెక్షన్స్ రాకపోవడం విశేషం. ఇక గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూర్య చేసిన సూపర్ హిట్ మూవీ సూర్య సన్నాఫ్ కృష్ణన్ 3.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టాప్ 7గా నిలిచింది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>