MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకు ఒక టర్నింగ్ తీసుకుంటున్న పరిస్థితులలో మరికొన్ని రోజులలో జరగబోతున్న ఎన్నికల వేడి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత వేడెక్కిస్తోంది. తెలుగుదేశం పార్టీ మనుగడకు అత్యంత కీలకంగా మారిన ఈ ఎన్నికలలో ఏదోవిధంగా విజయం సాధించాలని తన వయసును కూడ లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు విపరీతంగా తెలుగుదేశం పార్టీ విజయం కోసం కష్ట పడుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ ఈ ఎన్నికల రణ్క్షక్షేత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పరిస్థితుల మధ్య ఇలాంటి కీలకసమయంలో నందమూరి ఎన్టీరామారావు మనవడిని అని గర్వంగjunior ntr{#}CBN;Balakrishna;Hrithik Roshan;bollywood;Jr NTR;Chiranjeevi;Hero;Cinema;Telugu Desam Party;media;News;politics;Janasena;Andhra Pradeshజూనియర్ ని వదలని రాజకీయంజూనియర్ ని వదలని రాజకీయంjunior ntr{#}CBN;Balakrishna;Hrithik Roshan;bollywood;Jr NTR;Chiranjeevi;Hero;Cinema;Telugu Desam Party;media;News;politics;Janasena;Andhra PradeshSat, 27 Apr 2024 08:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకు ఒక టర్నింగ్ తీసుకుంటున్న పరిస్థితులలో మరికొన్ని రోజులలో జరగబోతున్న ఎన్నికల వేడి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత వేడెక్కిస్తోంది. తెలుగుదేశం పార్టీ మనుగడకు అత్యంత కీలకంగా మారిన ఈ ఎన్నికలలో ఏదోవిధంగా విజయం సాధించాలని తన వయసును కూడ లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు విపరీతంగా తెలుగుదేశం పార్టీ విజయం కోసం కష్ట పడుతున్నారు.



ఇప్పటికే బాలకృష్ణ ఈ ఎన్నికల రణ్క్షక్షేత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పరిస్థితుల మధ్య ఇలాంటి కీలకసమయంలో నందమూరి ఎన్టీరామారావు మనవడిని అని గర్వంగా చెప్పుకునే జూనియర్ ఎన్టీఆర్ ఈసారి ఎన్నికల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అంటూ కొందరు నందమూరి అభిమానులు చాల బాధపడుతున్నారు. దీనికి తగ్గట్టుగానే జూనియర్ తన వ్యూహాత్మక మౌనాన్ని మరింత కొనసాగిస్తూ తారక్ అతడు నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘వార్ 2’ షూటింగ్ లో మేనెల అంతా బిజీగా ఉండబోతున్నాడు.



హృతిక్ రోషన్ తో జూనియర్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. రాజకీయాలకు దూరంగా ఉండాలని జూనియర్ ఎంతో ప్రయత్నిస్తున్నా రాజకీయాలు మాత్రం అతడిని నీడలా వెంటాడుతూనే ఉన్నాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈమధ్యనే ముగిసిన నామినేషన్స్ పర్వంలో కొందరు నాయకులు నామినేషన్ వేస్తున్నప్పుడు జరిగిన ఊరేగింపులో కొందరు జూనియర్ అభిమానులు తమ హీరో ఫ్లెక్సీలను పట్టుకుని ‘రాబోయే కాలానికి కాబోయే సిఎమ్ అంటూ కొందరు బ్యానర్లు పట్టుకుని ఊరేగింపులో పాల్గొనడం మరికొందరు ఫ్లక్సీలు కట్టడం రాజకీయ వర్గాలలో షాకింగ్ న్యూస్ గా మారింది.



పరిస్థితులు ఇలా కొనసాగుతుండగా చిరంజీవి ప్రత్యక్షంగా జనసేన కు ప్రచారం చేయలేకపోయినా తన సోషల్ మీడియా సందేసాలు ద్వారా జనసేన కు అదేవిధంగా కూటమికి సపోర్ట్ తెలియచేస్తూ ఉంటే కనీసం ఇలాంటి మద్దతు కూడ నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఇప్పటివరకు ప్రకటించకుండా ఎందుకు తన వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తున్నాడు అంటూ మరికొందరు నందమూరి అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..  






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>