PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/key-initiatives-in-ycp-manifestob413ce75-81df-4812-9e9b-923c29e366c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/key-initiatives-in-ycp-manifestob413ce75-81df-4812-9e9b-923c29e366c2-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ప్రచారంతో ప్రత్యర్థులకు దిమ్మతిరిగే షాకులిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మేనిఫెస్టోతో జగన్ పొలిటికల్ లెక్కలను మార్చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూర్చే హామీలపై జగన్ తాజా మేనిఫెస్టోలో దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాననే నమ్మకాన్ని కలిగించే విషయంలో జగన్ సక్సెస్ అయ్యారు.jagan{#}CBN;Hanu Raghavapudi;Jagan;Y. S. Rajasekhara Reddy;CM;YCPమేనిఫెస్టోతో లెక్క మార్చేసిన సీఎం జగన్.. ఆ ప్రకటనలతో ప్రత్యర్థులకు షాక్!మేనిఫెస్టోతో లెక్క మార్చేసిన సీఎం జగన్.. ఆ ప్రకటనలతో ప్రత్యర్థులకు షాక్!jagan{#}CBN;Hanu Raghavapudi;Jagan;Y. S. Rajasekhara Reddy;CM;YCPSat, 27 Apr 2024 16:15:00 GMTఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ప్రచారంతో ప్రత్యర్థులకు దిమ్మతిరిగే షాకులిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మేనిఫెస్టోతో జగన్ పొలిటికల్ లెక్కలను మార్చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూర్చే హామీలపై జగన్ తాజా మేనిఫెస్టోలో దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాననే నమ్మకాన్ని కలిగించే విషయంలో జగన్ సక్సెస్ అయ్యారు.
 
జగన్ చేసిన ఒకే ఒక్క ప్రకటన ప్రత్యర్థులకు షాక్ కు గురి చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చినా హామీలను అమలు చేయడం అసాధ్యమని జగన్ లెక్కలతో తేల్చి చెప్పడంతో ఇచ్చిన హామీల విషయంలో కూటమి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతు రుణమాఫీ విషయంలో చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారో సైతం కళ్లకు కట్టినట్టుగా జగన్ వివరించారు.
 
2014లో ఇచ్చిన ముఖ్య హామీలనే అమలు చేయని బాబు ఇప్పుడు అంతకు మించి హామీలను అమలు చేయడం అసాధ్యమని జగన్ కామెంట్లతో క్లారిటీ వచ్చేసింది. భారీగా పథకాలను ప్రకటించి ప్రజలను తాను మోసం చేయనని తాను ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటానని ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని జగన్ చెబుతున్నారు. వైఎస్సార్ చేయూత, కాపునేస్తం, సున్నావడ్డీ పథకాలు కొనసాగాలంటే వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యం కానుంది.
 
ఏపీలోని ప్రజలు 2014 - 2019 మధ్య చంద్రబాబు పాలనను 2019 - 2024 మధ్య జగన్ పాలనను చూశారు. ఎవరి పాలనలో సంక్షేమ పథకాలు అందాయో ఎవరి పాలనలో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు బెనిఫిట్ పొందారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైతాంగం, పెన్షనర్లను ఈ మేనిఫెస్టో కొంతమేర నిరాశపరిచినా మిగిలిన అన్ని వర్గాలకు మాత్రం ఈ మేనిఫెస్టో ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. కొన్ని వర్గాలకు జగన్ రెట్టింపు సహాయం ప్రకటించడం ద్వారా వాళ్లకు భారీ మొత్తంలో బెనిఫిట్ కలగనుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>