PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-brahmani-mangalagiri-politics69f2ba73-1a2c-4220-b93f-51fab12d54ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-brahmani-mangalagiri-politics69f2ba73-1a2c-4220-b93f-51fab12d54ec-415x250-IndiaHerald.jpg•భర్త గెలుపే లక్ష్యంగా బ్రాహ్మణి అడుగులు.. •మహిళా ఓటర్లే ప్రధాన గురి •సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలు అమలు.. (అమరావతి - ఇండియా హెరాల్డ్ ) మరో 15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని టిడిపి నడుం బిగించింది.. మరొకవైపు అధికార పార్టీ మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే భీమా వ్యక్తం చేస్తున్నారు.. ఇలా ఎవరికి వారు పోటీపడుతూ అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తుండగా.. ఇక భర్తల గెలుపు కోసం భార్యలు బరిలోకి దిగడం ఆశ్చర్యాన్ని కలిగిసLOKESH;BRAHMANI;MANGALAGIRI;POLITICS{#}sandhya;Evening;Mangalagiri;Nara Brahmani;Nara Lokesh;NTR;Lokesh;Lokesh Kanagaraj;Husband;Yevaru;Elections;CBN;YCP;India;TDP;Partyఏపీ: పతి కోసం సతి ఆరాటం..ఫలించేనా..?ఏపీ: పతి కోసం సతి ఆరాటం..ఫలించేనా..?LOKESH;BRAHMANI;MANGALAGIRI;POLITICS{#}sandhya;Evening;Mangalagiri;Nara Brahmani;Nara Lokesh;NTR;Lokesh;Lokesh Kanagaraj;Husband;Yevaru;Elections;CBN;YCP;India;TDP;PartySat, 27 Apr 2024 10:19:05 GMT•భర్త గెలుపే లక్ష్యంగా బ్రాహ్మణి అడుగులు..

•మహిళా ఓటర్లే ప్రధాన గురి

•సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలు అమలు..


(అమరావతి - ఇండియా హెరాల్డ్ )

మరో 15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని టిడిపి నడుం బిగించింది.. మరొకవైపు అధికార పార్టీ మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే భీమా వ్యక్తం చేస్తున్నారు.. ఇలా ఎవరికి వారు పోటీపడుతూ అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తుండగా.. ఇక భర్తల గెలుపు కోసం భార్యలు బరిలోకి దిగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. పలుచోట్ల భర్తలకు అండగా సతీమణులు రంగంలోకి దిగి ప్రచారాలు చేస్తూ... ప్రజలలో మమేకమవుతూ తమ భర్త అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి మంచి చేకూరుతుంది అనే విషయాలను వివరిస్తూ రసవత్తరంగా ముందుకు సాగుతున్నారు.. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా సతుల కోసం పతులు,  పతుల కోసం సతులు చేస్తున్న ప్రచారాలు వివిధ రాష్ట్రాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే తన భర్తను ఎలాగైనా సరే అధికారంలోకి తీసుకురావాలనే నేపథ్యంలో రంగంలోకి దిగారు నారా వారి కోడలు నారా బ్రాహ్మణి.

మంగళగిరి నియోజకవర్గం నుండి టిడిపి తరఫున నారా లోకేష్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తన భర్త నారా లోకేష్ విజయం కోసం మంగళగిరిలో ప్రచారం ప్రారంభించారు. బ్రాహ్మణి ప్రజల కోసం నారా చంద్రబాబు, నారా లోకేష్ ఏం చేశారు?  అధికారంలోకి వస్తే ఏం చేస్తారు ? అన్న విషయాలను ఆమె ప్రజలకు అటు మహిళలకు వివరించారు.. మహిళ సాధికారతే నారా చంద్రబాబు,  లోకేష్  ప్రధాన లక్షమని.. ప్రజల కోసం పనిచేయడంలో చంద్రబాబుకు ఎవరు సాటి రారని.. రాష్ట్ర అభివృద్ధి బాబుతోనే సాధ్యమవుతుంది అంటూ ఆమె వ్యాఖ్యానించారు..

గత వారం రోజులుగా మంగళగిరిలో ప్రచారం చేస్తున్న నారా బ్రాహ్మణి ప్రచారంలో భాగంగా గతవారం సంధ్య స్పైసెస్ కంపెనీలోని కూలీలతో మాట్లాడారు. టిడిపి హయాంలో మహిళలకు ఎంతో సంక్షేమం జరిగిందని... ఆస్తిలో మహిళలకు కూడా సమాన హక్కు ఉంటుందని చెప్పిన నేత ఎన్టీఆర్ అని గుర్తు చేశారు.. మహిళా సాధికారతే ధ్యేయంగా,  రాష్ట్ర అభివృద్ధి ఆశయంగా సాగే నాయకుడు చంద్రబాబు మాత్రమే అని కూడా వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెషనల్ కోర్స్ లను ప్రవేశపెట్టి యువతకు ఎన్నో అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబుది అని పేద ప్రజలకు కష్టాలు కనుచూపుమేర కనిపించకూడదనే కలలు కన్నారని ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఇప్పుడు సూపర్ 6 పథకాలతో మీ ముందుకు వస్తున్నారని.. ఆమె వివరించారు. అంతేకాదు మంగళగిరి ప్రజల కోసం సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.. లోకేష్ రాబోయే ఎన్నికల్లో మీరంతా వారిని ఆశీర్వదిస్తే మరింత మెరుగైన అభివృద్ధిని మీరు పొందుతారు అంటూ కూడా ఆమె తెలిపారు.

ఇకపోతే 2024 ఎన్నికల్లో టిడిపి తరఫున నారా లోకేష్ బరిలోకి దిగుతున్నారు.. ఆయనకు వైసిపి అభ్యర్థి మురుగుడు లావణ్య పోటీకి దిగుతున్నారు.. దీంతో ఎలాగైనా సరే లోకేష్ గెలవాలని పలు కసరత్తుల చేస్తూ ఉండడం గమనార్హం.. ఇకపోతే భర్త గెలుపు కోసం అన్ని పనులను పక్కనపెట్టి ప్రజలతో మమేకం అవుతూ ప్రజలలో తన భర్తను గెలిపించాలని ప్రచారం చేస్తున్న నారా బ్రాహ్మణి కష్టం ఫలిస్తుందా?  అన్నది చూడాలి మొత్తానికైతే తన పతి కోసం ఈమె చేస్తున్న పోరాటం ఎంతవరకు కలిసి వస్తుందో అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>