Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanthd3dc77cc-bd39-4f27-a476-9ce4c7b2763f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanthd3dc77cc-bd39-4f27-a476-9ce4c7b2763f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు మెజారిటీ స్థానాలలో గెలవడం పైన దృష్టి పెట్టినప్పటికీ.. ఇక ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్లో విజయాన్ని మాత్రం అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. అదే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం. అయితే ఇది కేసీఆర్ సొంత జిల్లా కావడమే దీనికి ముఖ్య కారణం. ఇప్పటికే బిఆర్ఎస్ ప్రతిపక్ష హోదాకి పరిమితమైంది. ఇక ఆ పార్టీ కంచుకోట కెసిఆర్ సొంత జిల్లా అయిన మెదక్ లో బిఆర్ఎస్ను ఓడిస్తే ఆ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టొచ్చు అని మిగతా పార్టీలు అనుకుంRevanth{#}Medak;Sangareddy;District;Parliment;KCR;Backward Classes;revanth;CM;Congress;Reddy;Bharatiya Janata Party;MLA;Partyమెదక్ : రేవంత్ రాకతో కొత్త ఉత్సాహం.. ఇక కేసీఆర్ కు షాక్ తప్పదా?మెదక్ : రేవంత్ రాకతో కొత్త ఉత్సాహం.. ఇక కేసీఆర్ కు షాక్ తప్పదా?Revanth{#}Medak;Sangareddy;District;Parliment;KCR;Backward Classes;revanth;CM;Congress;Reddy;Bharatiya Janata Party;MLA;PartyFri, 26 Apr 2024 11:30:00 GMTప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు మెజారిటీ స్థానాలలో గెలవడం పైన దృష్టి పెట్టినప్పటికీ.. ఇక ఒక్క పార్లమెంట్ సెగ్మెంట్లో విజయాన్ని మాత్రం అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. అదే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం. అయితే ఇది కేసీఆర్ సొంత జిల్లా కావడమే దీనికి ముఖ్య కారణం. ఇప్పటికే బిఆర్ఎస్ ప్రతిపక్ష హోదాకి పరిమితమైంది. ఇక ఆ పార్టీ కంచుకోట కెసిఆర్ సొంత జిల్లా అయిన మెదక్ లో బిఆర్ఎస్ను ఓడిస్తే ఆ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టొచ్చు అని మిగతా పార్టీలు అనుకుంటున్నాయ్.


 ఈ క్రమంలోనే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతూన్నాయ్ అన్ని పార్టీలు. బిఆర్ఎస్ నుంచి మాజీ ఐఏఎస్ వెంకటరామిరెడ్డి ఇక బిజెపి నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థి నీలం మధు పోటీ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెదక్లో విజయం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే మైనంపల్లి హనుమంతరావు ఇక నీలం మధు వెంటే ప్రచార నిర్వహిస్తున్నారు. అయితే మొన్నటికి మొన్న నామినేషన్ సమయంలో నీలం మధు కోసం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రావడం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 సీఎం రేవంత్ రాకతో ఇక మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఇక కొత్త ఉత్సాహం నిండిపోయింది. అయితే రేవంత్ వచ్చినప్పుడు ఇక ఎంతలా జన సందోహం తరలి వచ్చారో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానికి తోడు పటాన్చెరులో కీలక నేతగా కొనసాగుతున్న కాటా శ్రీనివాస్, సంగారెడ్డి కాంగ్రెస్ కీలక నేత జగ్గారెడ్డి, ఇక మెదక్ లో మంచి పట్టున్న మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మైనంపల్లి రోహిత్ అందరూ కలిసి ఇక నీలం మధుని గెలిపించేందుకు సర్వశక్తులు ఓడ్డుతున్నారు. దానికి తోడు రేవంత్ నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంది. దీంతో ఇక కెసిఆర్ సొంత జిల్లాలోకాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంతమంది విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>