Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith5662f5a1-e4de-4926-8be1-a06230c26a21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith5662f5a1-e4de-4926-8be1-a06230c26a21-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా మరో నెల రోజుల్లో ప్రారంభం కాబోయే t20 వరల్డ్ కప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే జూన్ నెలలో ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ లో ఈసారి విశ్వవిజేతగా నిలవబోయే టీం ఏది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే అన్ని దేశాల క్రికెట్ ప్రేక్షకులు కూడా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. కాగా వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్లలో ఒకటిగా కొనసాగుతున్న టీమిండియాకు గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ టైటిల్ గెలవడం అనేది కేవలం కలగానే మారిపోయింది అనRohith{#}Cricket;Rohit Sharma;World Cup;ICC T20;Yashasvi Jaiswal;June;Indiaటి20 వరల్డ్ కప్ లో రోహిత్ అవసరం లేదు.. క్రికెట్ అనలిస్ట్ షాకింగ్ కామెంట్స్?టి20 వరల్డ్ కప్ లో రోహిత్ అవసరం లేదు.. క్రికెట్ అనలిస్ట్ షాకింగ్ కామెంట్స్?Rohith{#}Cricket;Rohit Sharma;World Cup;ICC T20;Yashasvi Jaiswal;June;IndiaFri, 26 Apr 2024 08:00:00 GMTప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా మరో నెల రోజుల్లో ప్రారంభం కాబోయే t20 వరల్డ్ కప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే జూన్ నెలలో ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ లో ఈసారి విశ్వవిజేతగా నిలవబోయే టీం ఏది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే అన్ని దేశాల క్రికెట్ ప్రేక్షకులు కూడా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. కాగా వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్లలో ఒకటిగా కొనసాగుతున్న టీమిండియాకు గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ టైటిల్ గెలవడం అనేది కేవలం కలగానే మారిపోయింది అన్న విషయం తెలిసిందే.


 కొన్ని ప్రపంచకప్ టోర్నిలలో సెమీఫైనల్ ఫైనల్ వరకు చేరుకున్నప్పటికీ చివరి అడుగులో తడబడుతూ చివరికి టైటిల్ను చేజార్చుకుంటుంది. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఇదే జరిగింది. అయితే జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో మాత్రం తప్పక విజయం సాధించి విశ్వవిజేతగా నిలవాలని అనుకుంటుంది భారత జట్టు. ఇక అత్యుత్తమ టీం తో బరిలోకి దిగేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. కాగా వరల్డ్ కప్ జట్టుకి కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. రోహిత్ సారథ్యంలో ఈసారి టీమిండియా వరల్డ్ కప్ గెలవడం ఖాయమని అందరూ అభిప్రాయపడుతున్నారు.


 ఇలాంటి సమయంలో క్రికెట్ ఆనలిస్ట్ జోయ్ బట్టచార్య మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశారు. టి20 వరల్డ్ కప్ కి కెప్టెన్ గా రోహిత్ శర్మ అవసరం లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన. రోహిత్ మంచి క్రికెటర్. కానీ ఇప్పుడు ఫామ్ లో లేడు. అతనికంటే జైస్వాల్ కోహ్లీ లాంటి వారు బెటర్ గా ఆడుతున్నారు  ఇలా ఫామ్ లో లేని అతడిని కెప్టెన్ గా ప్రకటించడం ద్వారా ఇక జట్టులో ఒక స్థానం ఫీల్ అయిపోతుంది. అది జట్టుకు మైనస్ గా మారిపోతుంది  నేనైతే ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న బుమ్రాను కెప్టెన్ చేసేవాడిని అంటూ జోయ్ బట్టచార్య అభిప్రాయం వ్యక్తం చేశాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>