PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nanidbf31863-2f5f-4f24-afb5-61be82bfaaae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nanidbf31863-2f5f-4f24-afb5-61be82bfaaae-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికలకు దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల నామినేషన్ల పర్వం హుషారుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా, గుడివాడ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి అయినటువంటి మాజీ మంత్రి కొడాలి నాని అలియాస్ కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు నామినేషన్‌పై తాజాగా వివాదం ఏర్పడింది. విషయం ఏమిటంటే నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారని RO (రిటర్నింగ్‌ అధికారి) కి తెలుగు దేశం నేతలు ఫిర్యాదు చేయడం ఇపుడు హాట్ టాపిక్ అయింది. మున్సిపల్‌ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు వారు ఫిర్యాదులో ఆరోపించారు. భవనాన్ని Kodali Nani{#}Krishna River;Kodali Nani;Yevaru;sree;Janasena;Amarnath Cave Temple;Telugu Desam Party;Pendurthi;Nani;Andhra Pradesh;TDP;Minister;News;YCPఏపీ: కొడాలి నాని నామినేషన్ పై రచ్చ దేనికి, ఏమైంది అసలు?ఏపీ: కొడాలి నాని నామినేషన్ పై రచ్చ దేనికి, ఏమైంది అసలు?Kodali Nani{#}Krishna River;Kodali Nani;Yevaru;sree;Janasena;Amarnath Cave Temple;Telugu Desam Party;Pendurthi;Nani;Andhra Pradesh;TDP;Minister;News;YCPFri, 26 Apr 2024 18:30:00 GMTఏపీలో ఎన్నికలకు దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల నామినేషన్ల పర్వం హుషారుగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా, గుడివాడ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి అయినటువంటి మాజీ మంత్రి కొడాలి నాని అలియాస్ కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు నామినేషన్‌పై తాజాగా వివాదం ఏర్పడింది. విషయం ఏమిటంటే నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం చేర్చారని RO (రిటర్నింగ్‌ అధికారి) కి తెలుగు దేశం నేతలు ఫిర్యాదు చేయడం ఇపుడు హాట్ టాపిక్ అయింది. మున్సిపల్‌ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించినట్లు వారు ఫిర్యాదులో ఆరోపించారు. భవనాన్ని అద్దెకిచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను దానికి జత చేయడం జరిగింది. దాంతో తప్పుడు సమాచారం ఇచ్చిన నాని నామినేషన్‌ను వెంటనే తిరస్కరించాలని వారు కోరారు.

ఇకపోతే ఏ ప్రభుత్వ కార్యాలయాన్నీ వారు వినియోగించలేదని కొడాలి నాని తన అఫిడవిట్‌లో పేర్కోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆధారాలతో సహా తెదేపా ఫిర్యాదు చేయడం ఇక్కడ కొసమెరుపు. కాగా దీనిపై ఇపుడు రిటర్నింగ్‌ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పెందుర్తి వైసీపీ అభ్యర్థి అదీప్‌రాజ్‌ నామినేషన్‌ కూడా పెండింగ్లో పడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక్కడ విషయం ఏమిటంటే... అదీప్‌రాజ్‌ పై ఉన్న కేసుల వివరాలు ఆ అఫిడవిట్లో పొందుపర్చలేదని జనసేన అభ్యంతరం తెలియజేయడం గమనార్హం. దాంతో రేపు ఉదయం 11 గంటల వరకు వివరణకు సమయం ఇచ్చారు అక్కడి రిటర్నింగ్‌ అధికారి.

ఎన్నికలకు ఇంకా 17 రోజులు ఉన్నప్పటికీ ఏపీ రాజకీయాలు ఇప్పటినుండే భగ్గుమంటున్నాయి. అధికార పార్టీని ఎలాగన్నా ఇరకాటంలో పెట్టాలని కూటమి కంకణం కట్టుకున్నట్టు కనబడుతోంది. మరోవైపు వైసీపీ పార్టీ గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పధకాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా ప్రభుత్వాన్ని స్థాపిస్తామనే ధీమాతో ముందుకు దూసుకుపోతోంది. ఇక ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా అంతిమ నిర్ణయం ప్రజలదే. ప్రజల తీర్పుకి ఇంకా 17 రోజుల సమయం మాత్రమే ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>