EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth-reddy507e005e-d33c-49ce-9505-61f4f1276195-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/revanth-reddy507e005e-d33c-49ce-9505-61f4f1276195-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని నన్ను నమ్మండి అంటూ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్న దేవుళ్ల మీద, చర్చిల మీద, ఒట్లు వేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. శాసన సభ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రచారంలో లో హామీలు ఇచ్చింది. అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి వాటిని అమలు చేశారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీపి పంద్రాగస్టులోపు పూర్తి చేసrevanth reddy{#}bus;Arogyasri;KCR;Reddy;CM;Narendra Modi;Congressగ్యారంటీలు: రేవంత్‌ పదవికి బిగుసుకుంటున్న ఉరితాళ్లు?గ్యారంటీలు: రేవంత్‌ పదవికి బిగుసుకుంటున్న ఉరితాళ్లు?revanth reddy{#}bus;Arogyasri;KCR;Reddy;CM;Narendra Modi;CongressFri, 26 Apr 2024 11:00:00 GMTతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని నన్ను నమ్మండి అంటూ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్న దేవుళ్ల మీద, చర్చిల మీద, ఒట్లు వేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. శాసన సభ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన  వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రచారంలో లో హామీలు ఇచ్చింది.


అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి వాటిని అమలు చేశారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీపి పంద్రాగస్టులోపు పూర్తి చేస్తామని.. వచ్చే వానాకాలం సీజన్ నుంచ వరికి రూ.500 బోనస్ ఇస్తామని చెబుతున్నారు. గ్యారంటీల అమలుకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని.. కోడ్ ముగియగానే గ్యారంటీల అమలుకు శ్రీకారం చుడతామని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్నారు.


కాకపోతే ప్రతిపక్షాలు మాత్రం ఆరు గ్యారంటీలు అమలు కాలేదు. మీరెలా ఓట్లు అడుగుతారు అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. ఈ సమయంలో ఈ రెండు పార్టీలు అమలు చేయని హామీలు చాలా ఉన్నాయని.. పదేళ్లలో మీరు చేయలేనివి.. వంద రోజుల్లో మాకు సాధ్యమా అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.


కేంద్రంలో మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లధనం తెచ్చి బ్యాంకుల ఖాతాలో రూ.15లక్షలు వేస్తానని చెప్పి మాట తప్పారు. కేసీఆర్ విషయానికొస్తే  ఇంటికో ఉద్యోగం,  నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇళ్లు, సొంతిల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇలా పలు హామీలను విస్మరించారు. మొత్తంగా చూస్తే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ లు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. కాకపోతే కాంగ్రెస్ కు ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రజలు ఆలోచించుకొని ఓటు వేసే అవకాశం ఉంది. ఆరు గ్యారంటీలు ప్రభావం చూపుతాయా అంటే కచ్ఛితంగా చెప్పలేం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>