PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bhuma-akhila-priya-baragava-naidu-bi-reddy-nandyala-poliitcs34ccef52-9eaf-467f-987d-b7a17ef7608f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bhuma-akhila-priya-baragava-naidu-bi-reddy-nandyala-poliitcs34ccef52-9eaf-467f-987d-b7a17ef7608f-415x250-IndiaHerald.jpg నంద్యాల లోక్సభ టిడిపి అభ్యర్థి బైరెడ్డి శబరికి.. ఆళ్లగడ్డ టిడిపి మహిళా నేత భూమా అఖిలప్రియకు గట్టి షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది.. నంద్యాల పార్లమెంటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అఖిల ప్రియ భర్త మద్దూరి భార్గవ నాయుడు నిన్నటి రోజున నామినేషన్ వేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా రాజకీయాల సైతం హీటెక్కించేలా కనిపిస్తున్నాయి. అఖిలప్రియ భర్త తరపున ఉన్న న్యాయవాది తో పాటు..ఎం చంద్రశేఖర్ తో పాటు ఆళ్లగడ్డ మాజీ కౌన్సిలర్ కృపాకర్ ఈ నామినేషన్ వేశారట. అయితే నామినేషన్ చివరి రోజు ఇలా అనూహ్యంగా అఖిల భర్త ఇBHUMA AKHILA PRIYA;BARAGAVA NAIDU;BI REDDY;NANDYALA;POLIITCS{#}Bhuma Akhila Priya;Husband;contract;Allagadda;Research and Analysis Wing;Nandyala;News;Lawyer;Thota Chandrasekhar;dr rajasekhar;Parliament;Bharatiya Janata Party;TDPరాయలసీమ: బైరెడ్డికి.. అఖిలప్రియ షాక్..!రాయలసీమ: బైరెడ్డికి.. అఖిలప్రియ షాక్..!BHUMA AKHILA PRIYA;BARAGAVA NAIDU;BI REDDY;NANDYALA;POLIITCS{#}Bhuma Akhila Priya;Husband;contract;Allagadda;Research and Analysis Wing;Nandyala;News;Lawyer;Thota Chandrasekhar;dr rajasekhar;Parliament;Bharatiya Janata Party;TDPFri, 26 Apr 2024 06:47:55 GMT
నంద్యాల లోక్సభ టిడిపి అభ్యర్థి బైరెడ్డి శబరికి.. ఆళ్లగడ్డ టిడిపి మహిళా నేత భూమా అఖిలప్రియకు గట్టి షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది.. నంద్యాల పార్లమెంటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అఖిల ప్రియ భర్త మద్దూరి భార్గవ నాయుడు నిన్నటి రోజున నామినేషన్ వేసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా రాజకీయాల సైతం హీటెక్కించేలా కనిపిస్తున్నాయి. అఖిలప్రియ భర్త తరపున ఉన్న న్యాయవాది తో పాటు..ఎం చంద్రశేఖర్ తో పాటు ఆళ్లగడ్డ మాజీ కౌన్సిలర్ కృపాకర్ ఈ నామినేషన్ వేశారట.


అయితే నామినేషన్ చివరి రోజు ఇలా అనూహ్యంగా  అఖిల భర్త ఇండిపెండెంట్గా బరిలోకి దిగబడంతో టిడిపిలో కూడా ఇప్పుడు చాలా అసహనం  మొదలవుతోంది.. అఖిల ప్రియ వైఖరి పైన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన కుమార్తె శబరి కూడా చాలా ఆగ్రహాన్ని తెలియజేస్తున్నట్టు తెలుస్తోంది.. అయితే అఖిల ప్రియ భర్త నామినేషన్ వెనుక ఆర్థిక వ్యవహారాలు ముడిపడి ఉన్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. నంద్యాల జిల్లాలో బిజెపి అధ్యక్షురాలు అయిన శబరి టిడిపిలోకి చేరి ఆ తర్వాత పార్లమెంటు స్థానానికి పోటీ చేయబోతున్నారు. ఎన్నికలలో భాగంగా అఖిలప్రియకు 7 కోట్ల రూపాయల వరకు సమకూర్చేలా ఒప్పందం జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


ఒప్పందం ప్రకారం ఆ డబ్బుని అందించకపోవడంతో అఖిల ప్రియ దంపతులు కాస్త కోపంగా ఉన్నట్టు సమాచారం.. ఈ సమయంలోనే శబరిని దెబ్బ వేసేందుకు భార్గవ్ రా ఎన్నికల బరిలో దిగబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది.. అయితే ఎన్నికలలో ప్రత్యర్ధులు భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాలని ప్లాన్ ప్రకారమే ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నారని అయితే బైరెడ్డి తమ నాయకురాలికి ఆర్థికంగా సహాయం చేయకపోవడంతో భార్గవ్ బరిలోకి దిగబోతున్నారని అఖిల ప్రియ అనుచరులు అయితే మాట్లాడుతున్నారు.. మరి కాపు సామాజిక వర్గానికి చెందిన భార్గవ్ రాముకు అక్కడ కులపరమైన అండ కూడా ఉందని తెలుస్తోంది. మొత్తానికి అఖిల ప్రియ తన భర్త ప్లాన్ ప్రకారమే ఇలా చేస్తున్నట్లు కనిపిస్తోంది.మరి ఈ వ్యవహారం పైన అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>