Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-a4f2698f-4b95-4b3f-b71c-9322acdb38d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-a4f2698f-4b95-4b3f-b71c-9322acdb38d3-415x250-IndiaHerald.jpgసాధారణంగా భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతూ ఉంటుంది. ఒకసారి మూడుముళ్ల బంధంతో ఒకటైన తర్వాత కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఒకరికి ఒకరు తోడునీడగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా నేనున్నాను అనే భరోసాని ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగాలి. ఇలా భార్యాభర్తల బంధంలో అన్యోన్యత అనేది ఎంతో ముఖ్యం. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఇలాంటి అన్యోన్యత ఎక్కడ కనిపించడం లేదు. పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతున్న భార్య భర్తలు నిజంగా భార్య భర్తలేనా లేకపోతే బద్ధ శత్రువుల అనMurder {#}Thota Chandrasekhar;Husband;Gift;police;Wife;marriageచెల్లి పెళ్లికి గిఫ్ట్ ఇచ్చాడని.. భర్తను చంపేసిన భార్య?చెల్లి పెళ్లికి గిఫ్ట్ ఇచ్చాడని.. భర్తను చంపేసిన భార్య?Murder {#}Thota Chandrasekhar;Husband;Gift;police;Wife;marriageThu, 25 Apr 2024 17:00:00 GMTసాధారణంగా భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతూ ఉంటుంది. ఒకసారి మూడుముళ్ల బంధంతో ఒకటైన తర్వాత కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ ఒకరికి ఒకరు తోడునీడగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా నేనున్నాను అనే భరోసాని ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవిస్తూ ముందుకు సాగాలి. ఇలా భార్యాభర్తల బంధంలో అన్యోన్యత అనేది ఎంతో ముఖ్యం. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఇలాంటి అన్యోన్యత ఎక్కడ కనిపించడం లేదు.


 పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతున్న భార్య భర్తలు నిజంగా భార్య భర్తలేనా లేకపోతే బద్ధ శత్రువుల అన్న విధంగా ప్రవర్తన తీరు మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా చిన్న చిన్న కారణాలకి కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరహా ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపాటుకు గురి చేస్తూ ఉన్నాయి. సాధారణంగా సినిమాల్లో చూపించినట్లుగానే.. నిజ జీవితంలో కూడా చాలామంది భార్యలు ఆడపడుచులతో మాట్లాడకుండా.. ఇక పేరు ఎత్తితేనే కోపంతో ఊగిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఇక్కడ ఒక భార్యకి తన భర్త చెల్లి అంటే అసలు నచ్చదు. ఆమెతో ఎప్పుడు మాట్లాడిన భర్త పై కోపడుతూ ఉండేది. అయితే ఇటీవల ఏకంగా పెళ్లికి తన సోదరికి గిఫ్ట్ ఇచ్చాడు అన్న కారణంతో సొంత భర్తని చంపేసుకుంది భార్య. ఈ ఘటన యూపీలో వెలుగులోకి వచ్చింది.  భారా బంకేకి చెందిన చంద్రశేఖర్ చెల్లికి ఈ నెల 26వ తేదీన పెళ్లి నిశ్చయం కావడంతో.. టీవీ, గోల్డ్ రింగ్ బహుమతిగా ఇచ్చాడు. ఇది నచ్చని అతని భార్య అతనితో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలోనే తన సోదరుని పిలిపించి ఇద్దరు కలిసి చంద్రశేఖర్ ను రెండు గంటల పాటు కర్రలతో కొట్టారు. ఇక తర్వాత ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏకంగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>