MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vm9e63de94-f07c-4038-aa2a-6ff847739a05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vm9e63de94-f07c-4038-aa2a-6ff847739a05-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో చాలా స్లో గా సినిమాలు చేసే దర్శకులలో వంశీ పైడిపల్లి ఒకరు. ఈయన ఒక హీరోతో సినిమా అనుకుంటే ఆ హీరోకు ఎన్ని ప్రాజెక్టులు ఉన్న అవి పూర్తి అయ్యే వరకు వెయిట్ చేసి అతనితోనే సినిమా చేస్తూ ఉంటాడు. మధ్యలో స్పీడుగా సినిమా పూర్తి చేసి దాన్ని విడుదల చేయాలి అనే ఉద్దేశంలో ఈయన పెద్దగా ఉండదు. దానితో ఈయన కెరియర్ మొదలు పెట్టి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతున్న ఈయన వేళ్ళ మీద లెక్క పెట్టే అన్ని సినిమాలు మాత్రమే తన కెరీర్ లో పూర్తి చేశాడు. స్లో గా సినిమాలు చేస్తూ వస్తున్న ఈయన పోయిన సంవత్సరం సంక్రాంVm{#}vamsi paidipally;Shahid;Makar Sakranti;Nijam;vamsi;dil raju;Hindi;News;bollywood;Cinemaఆ బాలీవుడ్ స్టార్ హీరోతో మూవీ సెట్ చేసుకున్న వంశీ పైడిపల్లి..?ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో మూవీ సెట్ చేసుకున్న వంశీ పైడిపల్లి..?Vm{#}vamsi paidipally;Shahid;Makar Sakranti;Nijam;vamsi;dil raju;Hindi;News;bollywood;CinemaThu, 25 Apr 2024 12:27:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో చాలా స్లో గా సినిమాలు చేసే దర్శకులలో వంశీ పైడిపల్లి ఒకరు. ఈయన ఒక హీరోతో సినిమా అనుకుంటే ఆ హీరోకు ఎన్ని ప్రాజెక్టులు ఉన్న అవి పూర్తి అయ్యే వరకు వెయిట్ చేసి అతనితోనే సినిమా చేస్తూ ఉంటాడు. మధ్యలో స్పీడుగా సినిమా పూర్తి చేసి దాన్ని విడుదల చేయాలి అనే ఉద్దేశంలో ఈయన పెద్దగా ఉండదు. దానితో ఈయన కెరియర్ మొదలు పెట్టి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతున్న ఈయన వేళ్ళ మీద లెక్క పెట్టే అన్ని సినిమాలు మాత్రమే తన కెరీర్ లో పూర్తి చేశాడు. స్లో గా సినిమాలు చేస్తూ వస్తున్న ఈయన పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయినటువంటి వారిసు సినిమాకు ఆఖరుగా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే సంవత్సరం పూర్తి అవుతున్న ఈయన తన తదుపరి మూవీ ని ఇప్పటికీ ఓకే చేసుకోలేదు.

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈయన ఓ బాలీవుడ్ హీరోతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి షహీద్ కపూర్ హీరోగా ఓ మూవీ చేయడానికి వంశీ పైడిపల్లి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నట్లు , అందులో భాగంగా తాజాగా ఈయనకు కథను కూడా వినిపించినట్లు , షాహిద్ కి కూడా వంశీ చెప్పిన కథ నచ్చడంతో ఈయన దర్శకత్వంలో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అలాగే ఈ మూవీ కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్త కనుక నిజం అయితే వంశీ ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>