EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chiranjeevifede3dba-3756-42b5-9645-ae50f44de93e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chiranjeevifede3dba-3756-42b5-9645-ae50f44de93e-415x250-IndiaHerald.jpgవెండితెర మీద ఆయన మెగాస్టార్. కానీ రాజకీయంగా మాత్రం ఫెయిల్యూర్ స్టోరీ ఉంది. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టటి ఎంతో మందిలో ఆశలు రేకేత్తించి చివరకి ఈ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తాను ఆరేళ్ల పాటు పెద్దల సభలో ఉండేలా రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారు. రెండేళ్ల పాటు కేంద్రమంత్రిగా పనిచేశారు. చిరంజీవి పార్టీ పెట్టగానే ఓ సామాజిక వర్గం చొక్కాలు చించుకొని మరీ ఆయన కోసం పనిచేసింది. ఈ క్రమంలో తమ ప్రాంతాల్లో అప్పటికే ఉన్న వేరే సామాజిక వర్గం నేతలను రాజకీయ ప్రముఖులను ధిక్కరించి మరీ ఎదురు నిలిచిన నాయకులూ ఎందరchiranjeevi{#}Godavari River;Rajya Sabha;Prajarajyam Party;CBN;Chiranjeevi;Assembly;TDP;Congress;Partyచిరంజీవి: పవన్‌, బాబు రాజకీయంలో మళ్లీ బకరా అయ్యారా?చిరంజీవి: పవన్‌, బాబు రాజకీయంలో మళ్లీ బకరా అయ్యారా?chiranjeevi{#}Godavari River;Rajya Sabha;Prajarajyam Party;CBN;Chiranjeevi;Assembly;TDP;Congress;PartyThu, 25 Apr 2024 08:12:00 GMTవెండితెర మీద ఆయన మెగాస్టార్. కానీ రాజకీయంగా మాత్రం ఫెయిల్యూర్ స్టోరీ ఉంది. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టటి ఎంతో మందిలో ఆశలు రేకేత్తించి చివరకి ఈ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. తాను ఆరేళ్ల పాటు పెద్దల సభలో ఉండేలా రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారు. రెండేళ్ల పాటు కేంద్రమంత్రిగా పనిచేశారు. చిరంజీవి పార్టీ పెట్టగానే ఓ సామాజిక వర్గం చొక్కాలు చించుకొని మరీ ఆయన కోసం పనిచేసింది.


ఈ క్రమంలో తమ ప్రాంతాల్లో అప్పటికే ఉన్న వేరే సామాజిక వర్గం నేతలను రాజకీయ ప్రముఖులను ధిక్కరించి మరీ ఎదురు నిలిచిన నాయకులూ ఎందరో ఉన్నారు. వారంతా ఏపీలో ఆల్టరేషన్ గా ఉంటామని కొత్త రాజకీయం చేస్తామని తమకు చిరంజీవి కొండంత అండగా ఉంటారని ఆశించారు. ఇక గోదావరి జిల్లాల్లో అయితే ప్రజారాజ్యం కోసం ఆస్తులు అమ్ముకొని పనిచేసిన బలమైన సామాజిక వర్గ నేతలు చాలామందే ఉన్నారు.


వారంతా కాంగ్రెస్ లో ప్రజారాజ్యం వీలీనం కాగానే రోడ్డున పడ్డారనే విమర్శలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో మెగాస్టార్ కూటమికి మద్ధతు ఇవ్వడం ద్వారా మేలు జరుగుతుందా లేదా అంటే ఇబ్బందులే ఎక్కువ అని చెప్పొచ్చు. తమకూ ఒక పార్టీ ఉండాలి.. రాజ్యాధికారం దక్కాలని భావించిన బలమైన సామాజిక వర్గానికి మెల్లగా మబ్లులు దిగిపోతున్ననేపథ్యంలో మళ్ళీ ప్రజారాజ్యం నాటి అనుభవాలు గుర్తుకు వస్తున్నాయి అంటున్నారు.


ఇదిలా ఉండగా ఉమ్మడి ఏపీలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేసి తాను నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని నాడు చిరంజీవి కోరినా పెద్దగా ప్రజల నుంచి స్పందన రాలేదు. ఇప్పుడు తన మాట విని కూటమి అభ్యర్థులను గెలిపించమని కోరితే పెద్దగా ప్రయోజనం ఉండదనే చర్చ కూడా ఉంది. పైగా టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు సీఎం అవుతారు. ఈ సందర్బంలో కాపులు ఎందుకు పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు అనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. పైగా రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి మళ్లీ ఆ మరకలు అంటించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఆయనపై ఉండే నమ్మకాన్ని చెరిపేస్తాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>