PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jonna-vittulabd33eb49-6c63-4dab-807e-01359563b3b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jonna-vittulabd33eb49-6c63-4dab-807e-01359563b3b3-415x250-IndiaHerald.jpgనామినేషన్ల గడువు దగ్గర పడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. అందులో భాగంగా తాజాగా విజయవాడ సెంట్రల్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన నెలకొంది. విజయవాడ సెంట్రల్ లో ఎక్కువగా బ్రాహ్మణ్ లు , కాపుల ఓట్లు ఉంటాయి. దానితో కొంతమంది బ్రాహ్మణుల ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయి అంటే ... మరి కొంతమంది కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ అధిక జనాభా మాత్రం బ్రాహ్మణులు , కాపులే ఉంటారు. దానితో ఎన్నో సార్లు ఇక్కడి టిక్కెట్ ను బ్రాహ్మణులకు ఇచ్చిJonna vittula{#}Bapatla;Vijayawada;Telugu Desam Party;srinivas;Reddy;politics;Telangana Chief Minister;Writer;Assembly;Population;Janasena;Party;Andhra Pradesh;Bharatiya Janata Party;YCPవిజయవాడ సెంట్రల్ రాజకీయాల్లోకి ఆ సినీ ప్రముఖుడు... కూటమి.. వైసీపీ కి గట్టి దెబ్బ తగలనందా..?విజయవాడ సెంట్రల్ రాజకీయాల్లోకి ఆ సినీ ప్రముఖుడు... కూటమి.. వైసీపీ కి గట్టి దెబ్బ తగలనందా..?Jonna vittula{#}Bapatla;Vijayawada;Telugu Desam Party;srinivas;Reddy;politics;Telangana Chief Minister;Writer;Assembly;Population;Janasena;Party;Andhra Pradesh;Bharatiya Janata Party;YCPThu, 25 Apr 2024 18:04:59 GMTనామినేషన్ల గడువు దగ్గర పడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. అందులో భాగంగా తాజాగా విజయవాడ సెంట్రల్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన నెలకొంది. విజయవాడ సెంట్రల్ లో ఎక్కువగా బ్రాహ్మణ్ లు , కాపుల ఓట్లు ఉంటాయి. దానితో కొంతమంది బ్రాహ్మణుల ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయి అంటే ... మరి కొంతమంది కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి అంటూ ఉంటారు.

ఏదేమైనప్పటికీ ఇక్కడ అధిక జనాభా మాత్రం బ్రాహ్మణులు , కాపులే ఉంటారు. దానితో ఎన్నో సార్లు ఇక్కడి టిక్కెట్ ను బ్రాహ్మణులకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే పోయినసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ ప్రాంత సీటును మల్లాది విష్ణుకు వైసీపీ పార్టీ ఇచ్చింది. ఆయన ఈ ప్రాంతం నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇక ఈ సారి కూడా ఆయన ఇక్కడి సీటును ఆశించారు.

కాకపోతే ఈయనకు ఆ ప్రాంతంలో గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయి అని అంచనా వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సీటును అతనికి ఇవ్వలేదు. ఈ సారి విజయవాడ సెంట్రల్ సీటును వెల్లంపల్లి శ్రీనివాస్ కు విజయవాడ సెంట్రల్ సీటును ఇచ్చాడు. ఇక మొదటి నుండి ఈ ప్రాంత వాసులు ఇక్కడే సీటును బ్రాహ్మణులకు ఇస్తారు అని అంచనా వేశారు. కానీ అలా ఇవ్వలేదు.

ఇక ప్రస్తుతం కూటమిలో భాగంగా తెలుగుదేశం , జనసేన , బీజేపీ లు రాష్ట్రంలో ఒక్క బ్రాహ్మణునికి కూడా సీటు ఇవ్వలేదు. ఇక వైసీపీ పార్టీ మాత్రం బాపట్ల ప్రాంతానికి సంబంధించిన ఒకే ఒక్క సీటును బ్రాహ్మణులకు కేటాయించారు. దీనితో రాష్ట్రంలో మంచి క్రేజ్ ఉన్న ఏ రాజకీయ పార్టీ లు అవి కూడా బ్రాహ్మణులకు సీట్లు కేటాయించడంలో ప్రాముఖ్యతను ఇవ్వలేదు అనే ఉద్దేశంలో బ్రాహ్మణులలో ఆగ్రహం నెలకొందో లేక మరే ఇతర కారణాలు తెలియదు కానీ విజయవాడ సెంట్రల్ లో సినీ రచయిత అయినటువంటి జొన్నవిత్తుల గారు విజయవాడ సెంట్రల్ నుండి తాజాగా నామినేషన్ వేశారు.

ఈయన విజయవాడ సెంట్రల్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరి ఈయన నామినేషన్ వేసి విజయవాడ సెంట్రల్ రాజకీయాల్లో దిగడం కూటమి మరియు వైసీపీ కి ఏమైనా నష్టం కలగజేస్తుందా అనేది చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>