MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/shahid-kapoor6dba7ff2-433e-4bcc-afc0-b0440531e129-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/shahid-kapoor6dba7ff2-433e-4bcc-afc0-b0440531e129-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో సినిమా చెయ్యడానికి వంశీ పైడిపల్లి ట్రై చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది. ఇటీవల హీరోని కలిసి ఓ కథ నేరేట్ చేశారని, అది ఆయనకు నచ్చడంతో సినిమా చేద్దామని చెప్పారని టాక్.అయితే షాహిద్ కపూర్, వంశీ పైడిపల్లిని స్టార్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు కలిపారట. ఆయనతో దర్శకుడు దిల్ రాజుకి మంచి రిలేషన్షిప్ ఉంది. 'మున్నా' మూవీతో వంశీ పైడిపల్లిని దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేసింది దిల్ రాజే. ఆ తర్వాత 'బృందావనం', 'ఎవడు', 'మహర్షి', 'వారిసు' సినిమాలు వాళ్ల వీరి కలయికలో వచ్చాయి. వంశీ పైడిపలShahid Kapoor{#}maharshi;Maharshi;king;Remake;Sri Venkateshwara Creations;vamsi paidipally;Shahid;dil raju;Blockbuster hit;Shahid Kapoor;vijay deverakonda;Joseph Vijay;vamsi;Huzur Nagar;Darsakudu;Hero;ram pothineni;Tollywood;News;Success;Director;Dil;producer;Producer;Cinemaషాహిద్: హిట్టు కోసం మన తెలుగు డైరెక్టర్ పై భారం?షాహిద్: హిట్టు కోసం మన తెలుగు డైరెక్టర్ పై భారం?Shahid Kapoor{#}maharshi;Maharshi;king;Remake;Sri Venkateshwara Creations;vamsi paidipally;Shahid;dil raju;Blockbuster hit;Shahid Kapoor;vijay deverakonda;Joseph Vijay;vamsi;Huzur Nagar;Darsakudu;Hero;ram pothineni;Tollywood;News;Success;Director;Dil;producer;Producer;CinemaThu, 25 Apr 2024 16:16:44 GMTబాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో సినిమా చెయ్యడానికి వంశీ పైడిపల్లి ట్రై చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది. ఇటీవల హీరోని కలిసి ఓ కథ నేరేట్ చేశారని, అది ఆయనకు నచ్చడంతో సినిమా చేద్దామని చెప్పారని టాక్.అయితే షాహిద్ కపూర్, వంశీ పైడిపల్లిని స్టార్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు కలిపారట. ఆయనతో దర్శకుడు దిల్ రాజుకి మంచి రిలేషన్షిప్ ఉంది. 'మున్నా' మూవీతో వంశీ పైడిపల్లిని దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేసింది దిల్ రాజే. ఆ తర్వాత 'బృందావనం', 'ఎవడు', 'మహర్షి', 'వారిసు' సినిమాలు వాళ్ల వీరి కలయికలో వచ్చాయి. వంశీ పైడిపల్లి తీసిన ఒక్క 'ఊపిరి'కి తప్ప మిగతా అన్ని సినిమాల నిర్మాణంలో దిల్ రాజు ఉన్నారు. ఇక షాహిద్ కపూర్ హీరోగా హిందీలో 'జెర్సీ'ని రీమేక్ చేశారు. ఇద్దరితో పరిచయం ఉండటంతో మీటింగ్ ని ఎరేంజ్ చేసి ప్రాజెక్ట్ సెట్ చేశాడు.ఇక షాహిద్ కపూర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చెయ్యనున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.


తెలుగు డైరెక్టర్లతో చేసిన సినిమాలతో హిందీలో షాహిద్ కపూర్ భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడం లేదంటే పెర్ఫార్మన్స్ విషయంలో పేరు తెచ్చుకోవడం జరిగింది. విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' మూవీని హిందీలో ఆయన రీమేక్ చేశారు. ఇక ఆ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. హిందీలో 'జెర్సీ' సినిమా అయితే అంతగా కమర్షియల్ సక్సెస్ కాలేదు. థియేటర్స్ దగ్గర కలెక్షన్స్ రాబట్టడంలో ఈ సినిమా ఫెయిల్ అయ్యింది. అయితే, షాహిద్ కపూర్ నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కథకు షాహిద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగార్జున, కార్తీతో వంశీ పైడిపల్లి సినిమాలు తీశారు. మహేష్ బాబుకు వంశీ పైడిపల్లి క్లోజ్ ఫ్రెండ్. మహేష్ బాబుకి మహర్షి లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా ఇచ్చాడు వంశీ. తరువాత వీరి కాంబినేషన్ లో ఓ సినిమా ఓకే అయింది కానీ ఆ సినిమా స్టార్ట్ అవ్వలేదు.తరువాత క్యాన్సిల్ అయిపోయింది. దీంతో వంశీ మహేష్ కోసం వెయిట్ చేసి విజయ్ తో వారిసు సినిమా చేశాడు. కానీ ఈ సినిమా అంతగా ఆడలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>