MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/vijay-devarakondacb76e8f5-eec9-48ac-b9e7-a22864e89081-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/vijay-devarakondacb76e8f5-eec9-48ac-b9e7-a22864e89081-415x250-IndiaHerald.jpgవిజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లాంటి భారీ ప్లాప్ తరువాత గౌతమ్‌ తిన్ననూరితో ప్రస్తుతం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది.ఫ్యామిలీ స్టార్‌ వంటి భారీ ప్లాప్ తర్వాత విజయ్‌ దేవరకొండ చుట్టూ పరిస్థితులు మారుతున్నాయి.గతంలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తగ్గిపోతూ వస్తుంది. దీంతో విజయ్ తో ఆల్రెడీ కమిట్ అయిన వారు తప్ప కొత్త దర్శకులు సినిమాలు చెయ్యడానికి సాహసించట్లేదు.ఇక ఈ క్రమంలో ఆయనను ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కలవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రశాంత్‌ నీల్‌తోVijay Devarakonda{#}gowtam;prashanth neel;Prasanth Neel;KGF;Nijam;Prabhas;Devarakonda;Joseph Vijay;Darsakudu;Hero;News;Director;Cinemaప్రశాంత్ నీల్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ..కానీ?ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ..కానీ?Vijay Devarakonda{#}gowtam;prashanth neel;Prasanth Neel;KGF;Nijam;Prabhas;Devarakonda;Joseph Vijay;Darsakudu;Hero;News;Director;CinemaThu, 25 Apr 2024 16:36:04 GMTవిజయ్‌ దేవరకొండ  ఫ్యామిలీ స్టార్ లాంటి భారీ ప్లాప్ తరువాత  గౌతమ్‌ తిన్ననూరితో ప్రస్తుతం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది.ఫ్యామిలీ స్టార్‌ వంటి భారీ ప్లాప్ తర్వాత విజయ్‌ దేవరకొండ చుట్టూ పరిస్థితులు మారుతున్నాయి.గతంలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తగ్గిపోతూ వస్తుంది. దీంతో విజయ్ తో ఆల్రెడీ కమిట్ అయిన వారు తప్ప కొత్త దర్శకులు సినిమాలు చెయ్యడానికి సాహసించట్లేదు.ఇక ఈ క్రమంలో ఆయనను ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌  కలవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేయాలని చాలామంది హీరోలు వెయిట్‌ చేస్తున్నారు. అయితే ఆయన మాత్రం అందరికీ ఓకే చెప్పడం లేదు. ఇప్పటికే ఓకే చెప్పిన తారక్‌  సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు రామ్‌చరణ్‌తో  ఓ సినిమా చేస్తారు అనే చర్చ కూడా ఉంది.అలాగే ప్రభాస్ తో సలార్ 2 ఇంకా వేరే సినిమా కూడా ఉంది. దాని తరువాత కేజిఎఫ్ సినిమా కూడా ఉంది.


ఇంత బిజీగా ఉన్న ఈ సమయంలో విజయ్‌ – ప్రశాంత్‌ నీల్‌ భేటీ ఆసక్తికరంగా మారింది. ఏదో సినిమా ప్లానే అని కొంతమంది అంటుండగా… అయితే అసలు సంగతి ఇదీ అంటూ విజయ్‌ టీమ్‌ చెప్పింది.హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ నీల్ విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లడం నిజమే కానీ అయితే సినిమా చేస్తున్నారని వస్తున్న పుకార్లు నిజం కావని టీమ్‌ చెబుతోంది. అలాగే ప్రశాంత్‌ నీల్‌ టీమ్‌ కూడా ఈ మాట చెబుతోంది. అయితే సినిమా లేనప్పుడు ఇప్పుడు విజయ్‌ దగ్గరకు ప్రశాంత్‌ నీల్‌ ప్రత్యేకంగా రావాల్సిన అవసరం ఏముంది అనేది మరికొందరి ప్రశ్న. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ 'సలార్‌ 2' ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బాగా బిజీగా ఉన్నారు. అయితే ఆ సినిమా కోసం వచ్చి ఉండొచ్చు అనే చర్చ జరుగుతోంది.నిజానికి 'సలార్‌ 2'లో ఓ స్పెషల్ పాత్ర ఉందని, దానిని ఓ యంగ్‌ హీరో చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు విజయ్‌ దేవరకొండను ప్రశాంత్‌ కలవడంతో దాని కోసమేమో అని సమాచారం తెలుస్తుంది. అయితే ఇప్పుడే ఈ విషయం ఎందుకు చెప్పడమని ఆగుతున్నారేమో అనే చర్చ కూడా సాగుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>