Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr9d4887cc-98f0-40d7-bccf-f52b70f7c920-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr9d4887cc-98f0-40d7-bccf-f52b70f7c920-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రచార హోరు కనిపిస్తుంది. అన్ని పార్టీల అభ్యర్థులందరూ కూడా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా అభ్యర్థుల తరఫున పార్టీలోని కీలక నేతలందరూ కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన పార్టీలుగా పిలుచుకునే బిజెపి, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక పార్లమెంట్ సెగ్మెంట్ విజయాన్ని మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకKcr{#}Chakram;Danam Nagender;Varsham;Parliament;MP;KTR;Bharatiya Janata Party;revanth;KCR;Congress;Telangana;Party;Parliment;CMఫ్రెండ్ కోసం కేటీఆర్.. కొడుకు కోసం కేసీఆర్.. ఆ సీటు తాకట్టు పెట్టేసారట?ఫ్రెండ్ కోసం కేటీఆర్.. కొడుకు కోసం కేసీఆర్.. ఆ సీటు తాకట్టు పెట్టేసారట?Kcr{#}Chakram;Danam Nagender;Varsham;Parliament;MP;KTR;Bharatiya Janata Party;revanth;KCR;Congress;Telangana;Party;Parliment;CMThu, 25 Apr 2024 10:30:00 GMTప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రచార హోరు కనిపిస్తుంది. అన్ని పార్టీల అభ్యర్థులందరూ కూడా గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా అభ్యర్థుల తరఫున పార్టీలోని కీలక నేతలందరూ కూడా  ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన పార్టీలుగా పిలుచుకునే బిజెపి, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక పార్లమెంట్ సెగ్మెంట్ విజయాన్ని మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. అదే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం.


 పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా సికింద్రాబాద్ లో విజయం ఎప్పుడు సెంటిమెంట్ గా కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో విజయం సాధించిన పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటుంది అనే సెంటిమెంట్ ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూనే వస్తుంది   అంతేకాదు ఇక సికింద్రాబాద్లో గెలిచిన పార్టీని రాష్ట్ర రాజకీయాలలో మంచి పట్టు సాధించి చక్రం తిప్పే అవకాశం ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు. అయితే గతంలో రెండు సార్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ సికింద్రాబాద్లో మాత్రం ఎంపీ సీట్ గెలుచుకోలేకపోయింది. వరుసగా ఇక్కడి నుంచి బిజెపి విజయం సాధిస్తూ వచ్చింది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పుడు ఇక్కడ తమ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అయితే ఇటీవల సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ తో కలిసి సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు సీఎం రేవంత్. ఈ క్రమంలోనే ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. పద్మారావు పరువు తీసేందుకే కేసీఆర్ ఆయనను పోటీకి దింపారు. పజ్జన్న నామినేషన్కు కేటీఆర్, కెసిఆర్ ఎందుకు రాలేదు. ఇది చూస్తే అర్థం చేసుకోవచ్చు సికింద్రాబాద్ సీట్ ని కెసిఆర్ బిజెపికి తాకట్టు పెట్టాడని అంటూ రేవంత్ చేసిన కామెంట్స్ సంచలనగా మారిపోయాయి. అయితే సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి, కేటీఆర్ మధ్య మంచి స్నేహం ఉందని తెలంగాణ రాజకీయాల్లో టాక్. ఒకరి గెలుపు కోసం ఒకరు లోలోపల  తోడ్పాటు అందించుకుంటారు అనే ప్రచారం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఫ్రెండ్ కోసం కేటీఆర్ ముందుకు సాగితే.. ఇక కొడుకు కోసం కేసీఆర్ సికింద్రాబాద్లో బిఆర్ఎస్ నుంచి డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారు అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>