PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/varma8b1a9ce6-22ed-40e4-aaa4-7899b2737fcd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/varma8b1a9ce6-22ed-40e4-aaa4-7899b2737fcd-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోయినసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండు చోట్ల నుండి పోటీ చేస్తే రెండు చోట్ల కూడా ఓడిపోయాడు. ఈ అపజయాన్ని ఆయన మాత్రమే కాకుండా ఆయనను అభిమానించే ప్రజలు, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. ఇక ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఆ రెండు ప్రాంతాల్లో నుండి ఒక దాని నుండి పోటీ చేస్తాడా..? లేక వేరే ప్రాంతాన్ని ఎంచుకుంటాడా అనే ఆసక్తి అంతటా నెలకొంది. అలాంటి పరిణామాలలో పవన్ ఈసారి ఎన్నికలలో పిఠాపురం నుండి పోటీ చేస్తాను అని ప్రకటించాడు. దానితో రాష్ట్రవ్యాప్తంగా పVarma{#}pithapuram;Varsham;Ram Gopal Varma;Assembly;kalyan;Partyపిఠాపురం కార్యకర్తలంతా ఆయన కనుసైగలోనే..?పిఠాపురం కార్యకర్తలంతా ఆయన కనుసైగలోనే..?Varma{#}pithapuram;Varsham;Ram Gopal Varma;Assembly;kalyan;PartyThu, 25 Apr 2024 10:39:00 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోయినసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండు చోట్ల నుండి పోటీ చేస్తే రెండు చోట్ల కూడా ఓడిపోయాడు. ఈ అపజయాన్ని ఆయన మాత్రమే కాకుండా ఆయనను అభిమానించే ప్రజలు, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. ఇక ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఆ రెండు ప్రాంతాల్లో నుండి ఒక దాని నుండి పోటీ చేస్తాడా..? లేక వేరే ప్రాంతాన్ని ఎంచుకుంటాడా అనే ఆసక్తి అంతటా నెలకొంది. అలాంటి పరిణామాలలో పవన్ ఈసారి ఎన్నికలలో పిఠాపురం నుండి పోటీ చేస్తాను అని ప్రకటించాడు.

దానితో రాష్ట్రవ్యాప్తంగా పిఠాపురం పై జనాల ఫోకస్ పడింది. ఈయన కూడా ఈసారి ఎలాగైనా గెలవాలి అనే ఉద్దేశంతో అన్ని రకాల వ్యూహాలను రచిస్తూ వస్తున్నాడు. ఇక ఈయన గెలుపులో ప్రధాన పాత్ర పోషించడానికి వర్మ రంగంలోకి దిగాడు. ప్రస్తుతం వర్మ పేరు పిఠాపురంలో మారుమోగుతుంది. పవన్ ఎక్కడ ఉంటే వర్మ అక్కడే ఉంటున్నాడు. అతనికి అద్భుతమైన స్థాయిలో తన సహాయాన్ని అందిస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేస్తే ఆ పత్రాలను కూడా స్వయంగా వర్మనే తీసుకువచ్చాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కూడా తనకు వీలు చిక్కినప్పుడల్లా వర్మపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు.

తనకి అద్భుతమైన భవిష్యత్తు ఉందని, రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి వెళతాడు అని చెబుతున్నాడు. ఇక వర్మ లేకుంటే పవన్ అడుగు కూడా బయటకు పెట్టడం లేదు. పిఠాపురంలో ఎలాంటి సమావేశమైనా ఏదైనా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుంది. దానితో కార్యకర్తలంతా కూడా వర్మ చెప్పిన విధంగానే నడుచుకుంటూ వస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కు ప్లేస్ హా , మైనస్ హా అనే విషయం కూడా కొంత మంది కి అర్థం కావడం లేదు. ఒక వేళ వర్మ ఏదైనా విషయంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకుడు అయితే అప్పుడు పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కొంత మంది లో తలెత్తుతున్నాయి. కాకపోతే పవన్ మాత్రం వర్మ ను అస్సలు దూరం పెట్టే అవకాశం లేదు అనే సంకేతాలు బయటకు వస్తున్నాయి. ఇలా వర్మ పిఠాపురం నియోజకవర్గం లో పవన్ ను గెలిపించడం కోసం తన శయశక్తుల ప్రయత్నిస్తున్నాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>