PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababuc9cc7962-52dd-4e54-b4a8-dd4dfb5b5e20-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababuc9cc7962-52dd-4e54-b4a8-dd4dfb5b5e20-415x250-IndiaHerald.jpgగత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ధరణి కీలక పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి సభలో మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం..అప్పటి పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ధరణి గురించి ప్రస్తావన లేకుండా సమావేశాన్ని, సభను ముగించలేదు. మొత్తం మీద భూ సమస్యల మీద పెద్ధ యుద్ధమే నడిచింది. ఇప్పుడు తాజాగా ఏపీలో ఇదే తరహాలో భూమికి సంబంధించిన పోర్టల్ గురించి ప్రచారం నడుస్తోంది. కాకపోతే ఈ అంశాన్ని లేవనెత్తింది ప్రతిపక్ష టీడీపీనా అంటే కాదు. జనసేన పార్టీ. తద్వారా బీజేపీని ప్రశ్నించినట్లయింది. అదెలా అంటే..chandrababu{#}dharani;pruthvi;Revanth Reddy;Telangana;YCP;Janasena;central government;Parliment;Party;CMజగన్‌పై కోపంతో మోడీని తప్పుబడుతున్న పవన్‌, బాబు?జగన్‌పై కోపంతో మోడీని తప్పుబడుతున్న పవన్‌, బాబు?chandrababu{#}dharani;pruthvi;Revanth Reddy;Telangana;YCP;Janasena;central government;Parliment;Party;CMThu, 25 Apr 2024 07:57:00 GMTగత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ధరణి కీలక పాత్ర పోషించిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి సభలో మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం..అప్పటి పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ధరణి గురించి ప్రస్తావన లేకుండా సమావేశాన్ని, సభను ముగించలేదు. మొత్తం మీద భూ సమస్యల మీద పెద్ధ యుద్ధమే నడిచింది.


ఇప్పుడు తాజాగా ఏపీలో ఇదే తరహాలో భూమికి సంబంధించిన పోర్టల్ గురించి ప్రచారం నడుస్తోంది. కాకపోతే ఈ అంశాన్ని లేవనెత్తింది ప్రతిపక్ష టీడీపీనా అంటే కాదు. జనసేన పార్టీ.  తద్వారా బీజేపీని ప్రశ్నించినట్లయింది. అదెలా అంటే.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమల్లోకి తెచ్చింది.   దీని గురించి ప్రశ్నిస్తూ ఆ పార్టీ నాయకుడు, నటుడు పృథ్వీ తో యాడ్లు చేయించి.. దీనిపై దుష్ర్పచారం చేస్తోంది జనసేన.


మీ భూములపై మీకు హక్కు లేకుండా చేస్తున్నారు. లాక్కొంటున్నారు.  అంటూ లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇది తెలంగాణలో ధరణి మాదిరిగా సొంతంగా సీఎం తీసుకున్న నిర్ణయం కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో  సుదీర్ఘంగా చర్చించి తీసుకొచ్చిన చట్టం. దీనిని ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తున్నారు అంతే. కానీ ఇదేదో తప్పని ఈ చట్టం ద్వారా భూములు లాక్కొంటారు అని జనసేన నాయకులు బీజేపీని ప్రశ్నించినట్లయింది.


సహజంగా ఏ యాప్ అయినా.. మరేదైనా భూములకు సంబంధించిన సమస్యలు ఉండటం సహజం. అయితే భూ సమస్యలు, తగాదాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో కేంద్రం సుదీర్ఘంగా చర్చలు జరిపి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమల్లోకి తెచ్చింది. ఇందులో వైసీపీ ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. కానీ వైసీపీని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తోంది. మరి ఇది ఎంత వరకు సమంజసమో పవన్ కల్యాణే ఆలోచించుకోవాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>