DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/kcraef5814a-83b1-4bff-84e4-98bc3e8bd26c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/kcraef5814a-83b1-4bff-84e4-98bc3e8bd26c-415x250-IndiaHerald.jpgఎన్నికల తర్వాత జారి పడి తుంటి విరగ్గొట్టుకుని ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన కేసీఆర్‌ ఇప్పుడు జనంలోకి వస్తున్నారు. జూలు విదులుస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారుపై జోరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. బస్సు యాత్రలో కాంగ్రెస్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటున్న కేసీఆర్‌.. రైతు బంధు అందరికి ఇచ్చాం.. ఈసారి ఉంటుందో ఉండదో తెలియదంటున్నారు. మిషన్ భగీరథ నీళ్లు మాయం అయ్యాయని.. కొత్త ప్రభుత్వంలో 225 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. కొనుగkcr{#}Kumaar;students;Nalgonda;Kaleswaram Project;December;Revanth Reddy;bus;KCR;Telangana;Andhra Pradesh;Congress;Ministerరెచ్చిపోతున్న కేసీఆర్‌.. జనం పట్టించుకుంటారా?రెచ్చిపోతున్న కేసీఆర్‌.. జనం పట్టించుకుంటారా?kcr{#}Kumaar;students;Nalgonda;Kaleswaram Project;December;Revanth Reddy;bus;KCR;Telangana;Andhra Pradesh;Congress;MinisterThu, 25 Apr 2024 10:00:00 GMTఎన్నికల తర్వాత జారి పడి తుంటి విరగ్గొట్టుకుని ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన కేసీఆర్‌ ఇప్పుడు జనంలోకి వస్తున్నారు. జూలు విదులుస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారుపై జోరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. బస్సు యాత్రలో కాంగ్రెస్ సర్కారుపై విరుచుకుపడుతున్నారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటున్న కేసీఆర్‌.. రైతు బంధు అందరికి ఇచ్చాం.. ఈసారి ఉంటుందో ఉండదో తెలియదంటున్నారు. మిషన్ భగీరథ నీళ్లు మాయం అయ్యాయని.. కొత్త ప్రభుత్వంలో 225 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అవస్థలు పడుతున్నారని.. డిసెంబర్ 9న రుణమాఫీ అన్నారు... ఇప్పటివరకు చేయలేదని.. కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు గాలికి వదిలేశారని మండిపడుతున్నారు.



రైతులు అంటే కాంగ్రెస్ కి బాధ్యత లేదని.. కేసీఆర్ వస్తున్నాడు అనగానే కాలవులో నీరు వదిలారని కేసీఆర్ అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో ఒకటి రెండు పిల్లలర్లు కుంగితే రాద్ధాంతం చేశారని.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి లేరని.. ఇవాళ ఇక్కడే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ ఉన్నారని.. నీకు నీళ్లు ఇవ్వడం చేతకావడం లేదా ఉత్తమ్ కుమార్ అని కేసీఆర్ నిలదీస్తున్నారు.


5 టీఎంసీల నీళ్లు టైల్ పాండ్ నుంచి ఏపీ వాళ్ళు తీసుకువెళుతుంటే ఏమి చేశారని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు బంధు అయ్యాయి.. రెసిడెన్షియల్ పాఠశాలను నాశనము చేశారు.. రెసిడెన్షియల్ పాఠశాలల్లో  ఆహారం బాగా లేక విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు
4, 5 విద్యార్థులు మృతిచెందారని కేసీఆర్ అంటున్నారు.


కేసీఆర్ కేసులకు, జైళ్లకి భయపడే వ్యక్తి కాదన్న కేసీఆర్.. ప్రాణం పోయినా పర్వాలేదు.. తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగితే సహించేది లేదని గర్జిస్తున్నారు. రైతులందరికీ రైతు బంధు, రైతు భీమా, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కేసీఆర్ గర్జనను జనం ఏమేరకు పట్టించుకుంటారో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>