PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalasima-kamalapuram-tdp-ycp-verasiva-reddy3c12928b-330d-4aa2-a0d0-046a68cb0085-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalasima-kamalapuram-tdp-ycp-verasiva-reddy3c12928b-330d-4aa2-a0d0-046a68cb0085-415x250-IndiaHerald.jpgఆంధ్రాలోని రాయలసీమ రాజకీయాలు రోజురోజుకి చాలా ఉత్కంఠ భరితంగా మారుతున్నాయి.. సీనియర్ నేతలు కూడా సీటు దక్కకపోవడంతో ఇతర పార్టీలలోకి వెళ్తూ ఉన్నారు.. ఇప్పుడు తాజాగా టిడిపి లో మొట్టమొదట తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టారు వీర శివారెడ్డి.. 1994లో మొదటిసారి కమలాపురం అభ్యర్థిగా టిడిపి పార్టీ నుంచి పార్టీగా నిలబడి ఎమ్మెల్యేగా విజయాన్ని కూడా అందుకున్నారు.. ఆ తర్వాత 1999లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంబి మైసూరారెడ్డి చేతిలో ఓడిపోయారు.. ఆ వెంటనే 2004లో టిడిపి అభ్యర్థిగా మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ విజRAYALASIMA;KAMALAPURAM;TDP;YCP;VERASIVA REDDY{#}kadapa;Rayalaseema;dr rajasekhar;Hanu Raghavapudi;YCP;MLA;TDP;Congress;Reddy;CMరాయలసీమ (కమలాపురం): వైసీపీ గూటికి టిడిపి నేత..!రాయలసీమ (కమలాపురం): వైసీపీ గూటికి టిడిపి నేత..!RAYALASIMA;KAMALAPURAM;TDP;YCP;VERASIVA REDDY{#}kadapa;Rayalaseema;dr rajasekhar;Hanu Raghavapudi;YCP;MLA;TDP;Congress;Reddy;CMThu, 25 Apr 2024 07:44:00 GMTఆంధ్రాలోని రాయలసీమ రాజకీయాలు రోజురోజుకి చాలా ఉత్కంఠ భరితంగా మారుతున్నాయి.. సీనియర్ నేతలు కూడా సీటు దక్కకపోవడంతో ఇతర పార్టీలలోకి వెళ్తూ ఉన్నారు.. ఇప్పుడు తాజాగా టిడిపి లో మొట్టమొదట తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టారు వీర శివారెడ్డి.. 1994లో మొదటిసారి కమలాపురం అభ్యర్థిగా టిడిపి పార్టీ నుంచి పార్టీగా నిలబడి ఎమ్మెల్యేగా విజయాన్ని కూడా అందుకున్నారు.. ఆ తర్వాత 1999లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంబి మైసూరారెడ్డి చేతిలో ఓడిపోయారు.. ఆ వెంటనే 2004లో టిడిపి అభ్యర్థిగా మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయారు. 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి సహాయంతో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు వీర శివారెడ్డి. దీంతో కమలాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా గెలిచారట.


ఆ తర్వాత రెండు రాష్ట్రాలు పునర్విభజన తదితర పరిణామాలతో 2014, 2019 ఎన్నికలకు దూరమయ్యారు వీర శివారెడ్డి.. 2019 ఎన్నికల సమయంలో మళ్లీ వైసీపీ పార్టీలో చేరిన ఈయన అక్కడ తగిన ప్రాధాన్యత కనిపించకపోవడంతో కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నారు.మళ్ళి ఈ ఏడాది జనవరిలో టిడిపి పార్టీలోకి చేరిన ఈయన కమలాపురం టికెట్ ని ఆశించారు. కానీ అది నెరవేరకపోవడంతో ఇప్పుడు మళ్లీ వైసీపీ పార్టీలోకి చేరడానికి సిద్ధమైనట్టుగా  ఆయన సన్నిహితుల సైతం తెలియజేస్తున్నారు.


ఈ రోజున పులివెందులలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తిరిగి మళ్లీ వైసీపీ పార్టీలోకి చేరేందుకు సిద్ధమయ్యారు ఈ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి.. కడప జిల్లా కమలాపురంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో టిడిపి పార్టీకి ఇలాంటి షాక్ తగులుతోంది. ఈ ఏడాది జనవరిలోనే టిడిపి పార్టీలోకి చేరిన వీర శివారెడ్డి ఇప్పుడు మళ్లీ తిరిగి వైసీపీ పార్టీలోకి చేరెందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే చాలామంది నేతలు కూడా వైసిపి పార్టీ వీడి ఇతర పార్టీలోకి చేరి కొన్ని కారణాల చేత మళ్లీ తిరిగి వైసిపి పార్టీలోకి చేరుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>