MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-thamanna-app-maharasta-cyber-case-file58069796-0528-4d5e-b6f6-fa45fcfbe00f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-thamanna-app-maharasta-cyber-case-file58069796-0528-4d5e-b6f6-fa45fcfbe00f-415x250-IndiaHerald.jpg టాలీవుడ్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. దాదాపుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 ఏళ్ళు పైగా అవుతున్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే బాలీవుడ్లో కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా తమన్నా చిక్కుల్లో పడ్డట్టుగా తెలుస్తోంది.. మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు తమన్నాకు నోటీసులు పంపించినట్లుగా సమాచారం. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.. అసలు విషయంలోకి వెళ్తే ఐపీఎల్ -2023 మ్యాచ్లు నిబంధనకు HEROIN;THAMANNA;APP;MAHARASTA;CYBER CASE;FILE{#}Kollywood;Sanjay Dutt;tamannaah bhatia;Tollywood;Heroine;Maharashtra;policeచిక్కుల్లో హీరోయిన్ తమన్నా.. పోలీసుల నుంచి నోటీస్.. ఏం జరిగిందంటే..?చిక్కుల్లో హీరోయిన్ తమన్నా.. పోలీసుల నుంచి నోటీస్.. ఏం జరిగిందంటే..?HEROIN;THAMANNA;APP;MAHARASTA;CYBER CASE;FILE{#}Kollywood;Sanjay Dutt;tamannaah bhatia;Tollywood;Heroine;Maharashtra;policeThu, 25 Apr 2024 11:34:00 GMT
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. దాదాపుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 ఏళ్ళు పైగా అవుతున్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే ఉంది. ఇటీవలే బాలీవుడ్లో కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా తమన్నా చిక్కుల్లో పడ్డట్టుగా తెలుస్తోంది.. మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు తమన్నాకు  నోటీసులు పంపించినట్లుగా సమాచారం. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..



అసలు విషయంలోకి వెళ్తే ఐపీఎల్ -2023 మ్యాచ్లు నిబంధనకు విరుద్ధంగా ఫెయిర్ ప్లే యాప్ లో ప్రత్యక్ష ప్రసారం చేసినందుకు ఈనెల 29న తమన్నా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులను సైతం పంపించినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా తమన్నా చేసిన ఈ పని వల్ల కొన్ని కోట్ల రూపాయలు నష్టం పోయామంటూ ఆ ప్రసార హక్కులు కూడా సొంతం చేసుకున్న వయకామ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో మహారాష్ట్ర సైబర్ క్రైమ్ నుంచి హీరోయిన్ తమన్నాకు నోటీసులు రావడానికి కారణం అయ్యిందట.


ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను సైతం వయాకామ్ సొంతం చేసుకుంది. ఈ కేసు పైన విచారణ చేపట్టేందుకు తమన్నా సహకరించాలంటూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అలాగే ఇదే కేసులో మరొక సీనియర్ నటుడు సంజయ్ దత్ కు కూడా పోలీసులు నోటీసుల్లో జారీ చేసినట్లు సమాచారం. ఈనెల 23న హాజరు కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పెయిర్ ప్లే టాటా ఐపిఎల్ లో చట్ట విరుద్ధంగా 2023లో ప్రదర్శించారని ఈ కారణంగా తమకు 100 కోట్లు నష్టం వచ్చాయని.. వయాకామ్ తమ ఫిర్యాదులో తెలియజేశారు. మరి ఈ విషయం పైన తమన్నా ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి. అయితే అభిమానులకు ఈ విషయం కాస్త షాక్కు గురి చేస్తోందని చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>