MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgసంక్రాంతి సీజన్ తరువాత టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సమ్మర్ సీజన్ కోట్లు కురిపిస్తుంది. అలాంటి సమ్మర్ సీజన్ ఈరోజు ధియేటర్లకు ప్రేక్షకులు రాని పరిస్థితి రావడం ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తోంది. పరీక్షల సీజన్ పూర్తి అయినప్పటికీ యూత్ చెప్పుకోతగ్గ సంఖ్యలో ధియేటర్లకు రావడం లేదు. టాప్ హీరోల సినిమాలు విడుదల లేకపోవడం ఒక కారణం అయితే చాలామంది ఐపిఎల్ టోర్నమెంట్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మరికొందరు ఎన్నికల హడావిడిలో బిజీగా గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిన్న సినిమాల వైపు కూడ వరALLARI NARESH{#}Naresh;allari naresh;Comedy;Tollywood;Darsakudu;Audience;Industry;Directorఅల్లరి నరేష్ స్టామినాకు పరీక్ష !అల్లరి నరేష్ స్టామినాకు పరీక్ష !ALLARI NARESH{#}Naresh;allari naresh;Comedy;Tollywood;Darsakudu;Audience;Industry;DirectorThu, 25 Apr 2024 14:25:25 GMTసంక్రాంతి సీజన్ తరువాత టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సమ్మర్ సీజన్ కోట్లు కురిపిస్తుంది. అలాంటి సమ్మర్ సీజన్ ఈరోజు ధియేటర్లకు ప్రేక్షకులు రాని పరిస్థితి రావడం ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తోంది. పరీక్షల సీజన్ పూర్తి అయినప్పటికీ యూత్ చెప్పుకోతగ్గ సంఖ్యలో ధియేటర్లకు రావడం లేదు. టాప్ హీరోల సినిమాలు విడుదల లేకపోవడం ఒక కారణం అయితే చాలామంది ఐపిఎల్ టోర్నమెంట్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మరికొందరు ఎన్నికల హడావిడిలో బిజీగా గడుపుతున్నారు.



ఇలాంటి పరిస్థితులలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిన్న సినిమాల వైపు కూడ వర్కింగ్ డేస్ లో ధియేటర్ల వైపు రావడంలేదు. ఇలాంటి పరిస్థితులలో మే నెల మొదటివారంలో విడుదలఅవుతున్న ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీతో తిరిగి అల్లరి నరేష్ తన సత్తాను చూపెట్టగలుగుతాడా అన్న అంచనాలు కొందరికి ఉన్నాయి. గతంలో నరేష్ తండ్రి ప్రముఖ దర్శకుడు ఈవివి సత్యనారాయణ జీవించి ఉన్న రోజులలో ప్రతి సంవత్సరం సమ్మర్ సీజన్ లో అల్లరి నరేష్ సినిమా విడుదల కావడమే కాకుండా ఆసినిమా హిట్ కూడ అయ్యేది.



అయితే ఆతరువాత మారిన పరిస్థితులలో ప్రేక్షకులు ‘జబర్దస్త్’ హాస్యానికి బాగా అలవాటు పడటంతో అల్లరి నరేష్ కామెడీ ప్రేక్షకులకు పెద్దగా నచ్చడంలేదు. ఇలాంటి పరిస్థితులలో మారిన పరిస్థితులకు అనుగుణంగా అల్లరోడు సీరియస్ పాత్రల వైపు దృష్టి మళ్ళినప్పటికీ అల్లరి నరేష్ కు ఆపాత్రలు పెద్దగా కలిసిరాలేదు. దీనితో తనకు బాగా కలిసి వచ్చిన కామెడీ జోనర్ ను ఎంచుకుని ‘ఆ ఒక్కటి అడక్కు’ అంటూ మండు వేసవిలో ఎన్నికల ముందు వస్తున్నాడు.



ఈసినిమాను నరేష్ ప్రమోట్ చేస్తూ ‘సుడిగాడు 2’ ప్రస్తావన తీసుకు వచ్చాడు. టాప్ హీరోలు అంతా తమ సినిమాలకు సీక్వెల్స్ చేస్తున్న పరిస్థితులలో తాను కూడ తనకెంతో పేరు తచ్చిపెట్టిన ‘సుడిగాడు’ మూవీకి సీక్వెల్ చేసే ఆలోచనలలో ఉన్నానని దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు తన ఆద్వర్యంలో జరుగుతున్న విషయాన్ని తెలియచేశాడు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>