EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/nara-lokeshaea139f5-93c2-426c-8b16-3901e480e297-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/nara-lokeshaea139f5-93c2-426c-8b16-3901e480e297-415x250-IndiaHerald.jpgచంద్రబాబు.. ఈ దేశంలోనే సీనియర్‌ పొలిటీషియన్‌.. ఏకంగా 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి. అవకాశం కలిసొస్తే మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం ఉన్న వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలో సత్తా చాటిన వ్యక్తి.. మరి అలాంటి వ్యక్తి కొడుకు అంటే అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి కదా. మరి ఆయన తనయుడు నారా లోకేష్‌..తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారా.. అనిపించుకోగలరా.. చూద్దాం.. నారా చంద్రబాబు ఏకైక కుమారుడు కావడం వల్ల లోకేష్‌కు చంద్రబాబు వారసత్వం వచ్చేందుకు అడ్డేమీ లేదు.nara lokesh{#}Telugu;India;Minister;Reddy;CBN;Partyచంద్రబాబు కొడుకు లోకేష్‌: నిరూపించుకోవాల్సింది చాలానే ఉంది?చంద్రబాబు కొడుకు లోకేష్‌: నిరూపించుకోవాల్సింది చాలానే ఉంది?nara lokesh{#}Telugu;India;Minister;Reddy;CBN;PartyWed, 24 Apr 2024 09:00:00 GMTచంద్రబాబు.. ఈ దేశంలోనే సీనియర్‌ పొలిటీషియన్‌.. ఏకంగా 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి. అవకాశం కలిసొస్తే మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం ఉన్న వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. జాతీయ స్థాయిలో సత్తా చాటిన వ్యక్తి.. మరి అలాంటి వ్యక్తి కొడుకు అంటే అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి కదా. మరి ఆయన తనయుడు నారా లోకేష్‌..తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారా.. అనిపించుకోగలరా.. చూద్దాం..


నారా చంద్రబాబు ఏకైక కుమారుడు కావడం వల్ల లోకేష్‌కు చంద్రబాబు వారసత్వం వచ్చేందుకు అడ్డేమీ లేదు. కానీ దాన్ని లోకేష్‌ నిరూపించుకోవడంలో చాలా తడబడ్డాడు. ఆకర్షణీయమైన రూపం కానీ.. ఆకట్టుకునే వాగ్ధాటి కానీ లోకేష్‌కు లేవు. అంతకుమించి విషయ పరిజ్ఞానం కూడా తొలి రోజుల్లో అంతంత మాత్రమే. చంద్రబాబు కొడుకు కావడం ఒక్కటే తన క్వాలిఫికేషన్‌ అన్నట్టుగా ఉండేది నారా లోకేష్‌ తీరు. దీనికి తోడు.. తొలిరోజుల్లో ప్రసంగాల్లో దొర్లిన తప్పుడు ఆయనపై పప్పు అని ప్రత్యర్థులు ముద్ర వేసేలా చేశాయి.


ఇక 2014లో పార్టీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి తీసుకోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికైనా అది పరోక్ష ఎన్నిక కావడం వల్ల పెద్దగా రాజకీయంగా సాధించిన పేరు రాలేదు. ఆ తర్వాత రాజకీయ జీవితంలో తొలి ఓటమి కూడా నారా లోకేష్‌కు ప్రతిబంధకంగా మారింది. 2014 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసిన నారా లోకేష్‌ ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో ఓడిపోయారు.


ఇలా అనేక ఆటుపోట్లతో నారా లోకేష్‌ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోలేకపోయారు. కానీ.. విపక్షంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్‌ కాస్త పరిణితి చెందాడనే చెప్పాలి. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా కాస్త జనంలో కలిసిపోయారు. ఇప్పుడు ఆయన ప్రసంగంలోనూ ధాటి కనిపిస్తోంది. క్రమంగా నారా లోకేష్‌ రాటుదేలుతున్నారు. అయినా ఆయన ఇంకా నిరూపించుకోవాల్సింది చాలానే ఉంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటి.. అధికారం సాధించి.. పాలనలో తన మార్కు చూపించి.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలని ఇండియా హెరాల్డ్ ఆకాంక్షిస్తోంది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>