DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/sharmila56cbbd9a-c8b1-4924-9943-7c16e4564f22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/sharmila56cbbd9a-c8b1-4924-9943-7c16e4564f22-415x250-IndiaHerald.jpgఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళను ఎంత లేదనుకున్నా ఒక విషయంలో మాత్రం తప్పకుండా అభినందించాల్సిందే. ఎందుకంటే ఏపీ లో ఆ పార్టీ జవసత్వాలు కోల్పోయి దాదాపు పదేళ్లు అవుతుంది. నాయకులు లేరు. క్యాడర్ లేదు. ఈ సమయంలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి.. జగన్ పై పోరాటం కొనసాగిస్తూనే పార్టీని బలోపేతం చేసేలా కృషి చేస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ చేయలేని పనిని ఆమె చేసి చూపించింది. దాదాపు పార్టీ పెట్టి మూడో ఎన్నికను ఎదుర్కొంటున్న పవన్ కల్యాణ్ కు సాధ్యం కానీ అంశాన్ని చాలా సులభంగా చేయగలిగింది. ఇంతకీ ఆsharmila{#}mithra;India;Andhra Pradesh;Pawan Kalyan;Bharatiya Janata Party;Assembly;MP;Jagan;Party;Congressపవన్‌ చేయలేనిది.. షర్మిల చేసి చూపించిందిగా?పవన్‌ చేయలేనిది.. షర్మిల చేసి చూపించిందిగా?sharmila{#}mithra;India;Andhra Pradesh;Pawan Kalyan;Bharatiya Janata Party;Assembly;MP;Jagan;Party;CongressWed, 24 Apr 2024 10:00:00 GMTఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళను ఎంత లేదనుకున్నా ఒక విషయంలో మాత్రం తప్పకుండా అభినందించాల్సిందే. ఎందుకంటే ఏపీ లో  ఆ పార్టీ జవసత్వాలు కోల్పోయి దాదాపు పదేళ్లు అవుతుంది. నాయకులు లేరు. క్యాడర్ లేదు. ఈ సమయంలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి.. జగన్ పై పోరాటం కొనసాగిస్తూనే పార్టీని బలోపేతం చేసేలా కృషి చేస్తున్నారు.


పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ చేయలేని పనిని ఆమె చేసి చూపించింది.  దాదాపు పార్టీ పెట్టి మూడో ఎన్నికను ఎదుర్కొంటున్న పవన్ కల్యాణ్ కు సాధ్యం కానీ అంశాన్ని చాలా సులభంగా చేయగలిగింది. ఇంతకీ ఆమె చేసిన పని ఏంటంటే.. అన్ని చోట్ల పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం. ఈ అభ్యర్థుల్లో కూడా మార్పులు చేర్పులు చేయడం.. ఏపీ కాంగ్రెస్ లో కూడా టికెట్ల కోసం డిమాండ్ ఉండేలా చేయడం ఆమె సాధించిన విజయాలుగా చెప్పవచ్చు.


ఈ విషయంలో ఆమెను చూసి పవన్ కల్యాణ్ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే పవన్ గత ఎన్నికల్లో చాలా చోట్ల అభ్యర్థులను బరిలో దింపనే లేదు. బీజేపీ సైతం పొత్తు లేకుండా వెళ్లే సాహసం చేయలేకపోయింది. కానీ షర్మిళ చాలా సునాయసంగా ఈ క్రతువును పూర్తి చేశారు. తాజాగా ఏపీ ఎన్నికలకు సంబంధించి మరో 38 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు అధిష్ఠానం ప్రకటనను జారీ చేసింది.


ఈ జాబితాలో మొత్తం 28 స్థానాలకు అభ్యర్థులు ఉండగా.. గతంలో ప్రకటించిన పది స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. నాలుగో దశలో జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం అయింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 154 అసెంబ్లీ, 20 ఎంపీ స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించి ఔరా అనిపించింది. మిగతా స్థానాలు మిత్ర పక్షాలు ఇండియా కూటమికి కేటాయించింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపడంలో ఆమె విజయవంతం అయ్యారనే చెప్పవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>