PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp72853732-bcbe-4bde-b95c-bc84e4f6cf42-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp72853732-bcbe-4bde-b95c-bc84e4f6cf42-415x250-IndiaHerald.jpgఇటీవల టీడీపీకి సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలోని 175 స్థానాల్లో వైసీపీ 147 సీట్లలో బలంగా ఉందని ఆ వీడియోలో వినిపించింది. దీంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. ఈక్రమంలో ఇప్పుడు టీడీపీకి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ నకు ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నాయకులు సిద్ధం అవుతున్నారు. అవును.. తాజాగా టీడీపీ ఆఫీసులో ఆ పార్టీ ఎన్నారై విభాగం కో ఆర్డినేటర్ కోమటి జయరాం పార్టీ శ్రేణులtdp{#}Komati;Manam;Andhra Pradesh;YCP;TDP;Partyటీడీపీ కోసం ఎన్నారైలు.. అంతగా బరితెగిస్తున్నారా?టీడీపీ కోసం ఎన్నారైలు.. అంతగా బరితెగిస్తున్నారా?tdp{#}Komati;Manam;Andhra Pradesh;YCP;TDP;PartyWed, 24 Apr 2024 08:47:00 GMTఇటీవల టీడీపీకి సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలోని 175 స్థానాల్లో వైసీపీ 147 సీట్లలో బలంగా ఉందని ఆ వీడియోలో వినిపించింది. దీంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. ఈక్రమంలో ఇప్పుడు టీడీపీకి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.


ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ నకు ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నాయకులు సిద్ధం అవుతున్నారు. అవును.. తాజాగా టీడీపీ ఆఫీసులో ఆ పార్టీ ఎన్నారై విభాగం కో ఆర్డినేటర్ కోమటి జయరాం పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇది తెగ హల్ చల్ చేస్తోంది. ఇందులో ఓటర్లకు డబ్బులు ఎలా పంచాలో ఆయన పలు సూచనలు చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉంది అంటే..


ఇప్పుడు మనం అంతా ఫోకస్డ్ గా వెళ్తేనే పని జరుగుతుంది. 5 నుంచి 10 కుటుంబాలను ఫోకస్ చేయాలి. మనం మన ఊరెళ్తే ఈ వెధవ మనకు ఓటు వేయడనేది మనకు తెలుసు. వాడిని మార్చడంలో మన నైపుణ్యం వెలికి తీయాలి. వాడికి ఏ రకంగానైనా మనకున్న ఎబిలిటీతో వాడికున్న అవసరం ఏమిటో తెలుసుకొని ట్యూన్ చేసుకోగలిగితే నాలుగైదు ఓట్లు మారతాయి.


ప్రతి నియోజకవర్గంలో వెయ్యి ఓట్లు మార్చినా చాలు. మనం అంతదూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన వారిమి అవుతాం. దీనిపై పని చేయడానికి ఇదే సమయం. ఇకవేళ డబ్బుతో మార్చగలిగినా.. రూ. రెండు, మూడు లక్షలతో ఆ పది కుటుంబాలను మార్చగల కెపాసిటీ మనకుంది. ఈ రూంలో ఉన్నవారికి రెండు, మూడు లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు అని ఈ వీడియోలో ఉంది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఓటరును తిట్టడంతో పాటు.. డబ్బు పెట్టి ఓటు కొనుగోలు చేయడం వెనుక వారి ఉద్దేశం బయటపడిందని పలువురు అంటున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>