PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/balayya-begins-his-election-campaign-today28a368cd-23e4-4462-83f9-8a953e70dd6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/balayya-begins-his-election-campaign-today28a368cd-23e4-4462-83f9-8a953e70dd6e-415x250-IndiaHerald.jpgసినీ, రాజకీయ రంగాలలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం సులువైన విషయం కాదు. అయితే బాలయ్య మాత్రం ఈ రెండు రంగాల్లో తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకోవడంతో పాటు రెండు రంగాలలో సక్సెస్ సాధిస్తున్నారు. హిందూపురం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య ఈ ఎన్నికల్లో సైతం మరోసారి గెలవడం ఖాయమని అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని తెలుస్తోంది. balakrishna{#}Hindupuram;Balakrishna;local language;MLA;Successతండ్రికి తగ్గ తనయుడు బాలయ్య.. అక్కడ అభివృద్ధిలో తన మార్క్ చూపించారుగా!తండ్రికి తగ్గ తనయుడు బాలయ్య.. అక్కడ అభివృద్ధిలో తన మార్క్ చూపించారుగా!balakrishna{#}Hindupuram;Balakrishna;local language;MLA;SuccessWed, 24 Apr 2024 10:05:00 GMTసినీ, రాజకీయ రంగాలలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడం సులువైన విషయం కాదు. అయితే బాలయ్య మాత్రం ఈ రెండు రంగాల్లో తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకోవడంతో పాటు రెండు రంగాలలో సక్సెస్ సాధిస్తున్నారు. హిందూపురం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య ఈ ఎన్నికల్లో సైతం మరోసారి గెలవడం ఖాయమని అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని తెలుస్తోంది.
 
గత ఐదేళ్లలో బాలయ్య ప్రతిపక్షంలో ఉన్నా హిందూపురం అభివృద్ధి మాత్రం ఆగలేదు. బాలయ్య హిందూపురంలో తాగునీటి సమస్యలను తీర్చడంతో పాటు బాలయ్య గ్రామాలలో సీసీ రోడ్లు, కల్వర్టులను నిర్మించారు. సొంతంగా క్యాంటీన్లను ఏర్పాటు చేసి రోజుకు 400 మందికి బాలయ్య భోజనం అందిస్తున్నారు. బాలయ్య ఎమ్మెల్యే కాదు దేవుడు అని హిందూపురంకు చెందిన కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
 
బాలయ్య సొంత నిధులు ఖర్చు చేసి ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. బాలయ్య ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే సొంత డబ్బులతో ఆపరేషన్లు నిర్వహిస్తున్న సందర్భాలు ఉన్నాయని స్థానిక ప్రజలు వెల్లడిస్తున్నారు. 30 వేల మెజారిటీతో బాలయ్యను గెలిపించుకుంటామని స్థానికులు వెల్లడిస్తున్నారు. బాలయ్య మళ్లీ ఎమ్మెల్యే అయితే మాత్రమే హిందూపురం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అక్కడి ప్రజలు అన్నారు.
 
కూటమి అధికారంలోకి వస్తే పేద రైతులకు రెండెకరాల భూమి ఇస్తానని బాలయ్య తాజాగా హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. బాలయ్య భోళా మనిషి అని మనస్సులో ఏదీ దాచుకోరని ప్రజలకు మంచి చేసే విషయంలో బాలయ్యకు బాలయ్యే సాటి అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే బాలయ్య మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. కొంతమంది ప్రజలు మాత్రం హిందూపురంను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని చెబుతున్నారు. బాలయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత హిందూపురం కొంతమేర అభివృద్ధి చెందిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>