DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababu1ff02b35-4fc4-4fea-86b7-7a5b0de0c5d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababu1ff02b35-4fc4-4fea-86b7-7a5b0de0c5d5-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సారి గత రెండు ఎన్నికల కంటే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తున్న ఆయన ఎక్కడ సమావేశం జరిగినా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఏపీ రాజకీయాల్లో చిరంజీవి అంశం తెరపైకి రావడంతో ఆయన్ను ఏమైనా అంటే ఊరుకొనేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సింహం సింగిల్ గా వస్తుంది అంటారు కానీ.. మీరంతా పంది కొక్కుల సమూహంలాగా రాష్ట్రాన్ని సమూలంగా దోచుకుతిన్నారు. మీరందరికీ డబ్బులు, అహంకారం ఎక్కువ అయ్యాయి. మా అన్న చిchandrababu{#}narasapuram;Narsapur;lion;Ram Charan Teja;Scheduled Tribes;Andhra Pradesh;Chiranjeevi;Pawan Kalyan;Jagan;CM;CBNచంద్రముఖిలా మారిపోతున్న చంద్రబాబును గమనించారా?చంద్రముఖిలా మారిపోతున్న చంద్రబాబును గమనించారా?chandrababu{#}narasapuram;Narsapur;lion;Ram Charan Teja;Scheduled Tribes;Andhra Pradesh;Chiranjeevi;Pawan Kalyan;Jagan;CM;CBNWed, 24 Apr 2024 13:00:00 GMTజనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సారి గత రెండు ఎన్నికల కంటే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తున్న ఆయన ఎక్కడ సమావేశం జరిగినా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఏపీ రాజకీయాల్లో చిరంజీవి అంశం తెరపైకి రావడంతో ఆయన్ను ఏమైనా అంటే ఊరుకొనేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.


సింహం సింగిల్ గా వస్తుంది అంటారు కానీ.. మీరంతా పంది కొక్కుల సమూహంలాగా రాష్ట్రాన్ని సమూలంగా దోచుకుతిన్నారు.  మీరందరికీ డబ్బులు, అహంకారం ఎక్కువ అయ్యాయి. మా అన్న చిరంజీవిని విమర్శిస్తే ఊరుకునేది లేదు. సజ్జల రామకృష్ణారెడ్డిని హెచ్చరిస్తున్నా.. మెగాస్టార్ అజాత శత్రువు. ఆయన జోలికి కాని శెట్టి బాలిజ, కాపు, ఎస్సీ, ఎస్టీ ఏ సామాజిక వర్గం జోలికి వచ్చినా ఊరుకోను. చిరంజీవి జనసేనకు రూ.5 కోట్ల విరాళం ఇచ్చి ఆయన కుమారుడు రామ్ చరణ్ ను కూడా విరాళం ఇవ్వమని చెప్పినందుకు వివాదం సృష్టిస్తున్నారు.


దీనిని రాజకీయం చేసి భూతద్దంలో చూపిస్తున్నారు. సీఎం రమేశ్, పెంచికట్ల రమేశ్  లను గెలిపించాలని కోరితే మీకెందుకు అంత కడుపుమంట అంటు ప్రశ్నించారు. ఒక్కసారి అద్దంలో చూసుకొండి. సింహంలా కాదు. పందికొక్కుల సమూహంలా ఉన్నారు అంటూ చెలరేగారు. ఒకప్పుడు చంద్రబాబు చాలా సాఫ్ట్ గా  ఉండేవారు. కానీ జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత ఆయనలో మార్పు వచ్చింది.


దుర్మార్గుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు నేను తోడు.  నరసాపురం గడ్డ మీద నుంచి చెబుతున్నా.. జగన్ అండ్ కో కు ఓటమి తప్పదు. సజ్జల.. నువ్వు మీ సీఎం పద్ధతి మార్చుకోండి. లేకుంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మోకాళ్లపై దేకిస్తాం అంటూ తీవ్ర పదజాలం వాడారు. వ్యక్తిగత జీవితాలు గురించి నీకెందుకు. ఎవరి కుటుంబంలో అయిన సమస్యలు సహజం. ప్రతి సారి వాటి గురించే మాట్లాడుతున్నారు. ఈ సారి మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటూ హెచ్చరించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>