BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr2ee7876b-9cc5-49f9-92cd-e8cbcc262ce5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr2ee7876b-9cc5-49f9-92cd-e8cbcc262ce5-415x250-IndiaHerald.jpgమరో 20 రోజుల్లో తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఈసారి దారుణంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జోష్‌లో ఉంటే.. బీఆర్ఎస్‌ శ్రేణుల్లో నైరాస్యం కనిపిస్తోంది. దీనికితోడు.. చాలా చోట్ల ఏకంగా ఎంపీ అభ్యర్థులు కూడా బీఆర్‌ఎస్‌ను వీడి అటు కాంగ్రెస్‌లోనూ.. ఇటు బీజేపీలోనూ చేరిపోయారు. ఈ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ అసలు ఒక్క సీటైనా ఈ ఎన్నికల్లో గెలుస్తుందా అన్న స్థాయికి ఆ పార్టీ గ్రాఫ్‌ పడిపోయింది. ఏ సర్kcr{#}Interview;KCR;MP;Bharatiya Janata Party;Survey;Loksabha;Assembly;Partyతెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. కేసీఆర్‌ లెక్క ఇదీ?తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు.. కేసీఆర్‌ లెక్క ఇదీ?kcr{#}Interview;KCR;MP;Bharatiya Janata Party;Survey;Loksabha;Assembly;PartyWed, 24 Apr 2024 07:41:00 GMTమరో 20 రోజుల్లో తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఈసారి దారుణంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జోష్‌లో ఉంటే.. బీఆర్ఎస్‌ శ్రేణుల్లో నైరాస్యం కనిపిస్తోంది. దీనికితోడు.. చాలా చోట్ల ఏకంగా ఎంపీ అభ్యర్థులు కూడా బీఆర్‌ఎస్‌ను వీడి అటు కాంగ్రెస్‌లోనూ.. ఇటు బీజేపీలోనూ చేరిపోయారు.

ఈ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ అసలు ఒక్క సీటైనా ఈ ఎన్నికల్లో గెలుస్తుందా అన్న స్థాయికి ఆ పార్టీ గ్రాఫ్‌ పడిపోయింది. ఏ సర్వే సంస్థ కూడా బీఆర్ఎస్‌కు మొత్తం 17 సీట్లలో రెండు కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని చెప్పట్లేదు.. ఈ నేపథ్యంలో ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన కేసీఆర్ మాత్రం.. ఈ ఎన్నికల్లో జనం బీజేపీని ఏమాత్రం పట్టించుకోరని చెప్పారు. ఆ పార్టీ మహా వస్తే ఒక్క సీటు వస్తుందని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్‌ కచ్చితంగా 8 నుంచి 10 సీట్లు గెలుచుకోబోతోందని చెప్పారు. అంటే.. కాంగ్రెస్‌కు 6-8 వరకూ వస్తాయని కేసీఆర్‌ చెప్పారన్నమాట. ఇదీ కేసీఆర్‌ లెక్క.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>