PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-ycp-fatherba9a364f-b47b-4cce-9ff0-ddc40f3cae7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-ycp-fatherba9a364f-b47b-4cce-9ff0-ddc40f3cae7b-415x250-IndiaHerald.jpg- ఒంగోలు పార్ల‌మెంటులో చెవిరెడ్డి.. చంద్ర‌గిరిలో వార‌సుడు పోటీ - పాత ప్ర‌త్య‌ర్థి టీడీపీ నానిపై మోహిత్‌రెడ్డి జోరు - తండ్రి ఛ‌రిష్మా, వివాద ర‌హితుడిగా గుర్తింపు ప్ల‌స్‌ ( తిరుప‌తి - ఇండియా హెరాల్డ్ ) తిరుప‌తి పుణ్యక్షేత్రం ఉన్న చిత్తూరు జిల్లాలో ఈ సారి వార‌సులు జోరుగా రంగంలో ఉన్నారు. ముఖ్యంగా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌స్తుత ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి త‌న‌యుడు.. మోహిత్ రెడ్డి రంగంలో ఉన్నారు. చెవిరెడ్డి హ‌వా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌జల మ‌నిషిగాAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ycp; father{#}Chevireddy Bhaskarareddy;June;Dookudu;Chittoor;Reddy;India;Success;YCP;TDP;Fatherతండ్రి, కొడుకు ఇద్ద‌రూ ఈ సారి గెలిచేస్తారా... వైసీపీ వార‌సుడికి గ్రాండ్ విక్ట‌రీనా...?తండ్రి, కొడుకు ఇద్ద‌రూ ఈ సారి గెలిచేస్తారా... వైసీపీ వార‌సుడికి గ్రాండ్ విక్ట‌రీనా...?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ycp; father{#}Chevireddy Bhaskarareddy;June;Dookudu;Chittoor;Reddy;India;Success;YCP;TDP;FatherWed, 24 Apr 2024 10:13:29 GMT- ఒంగోలు పార్ల‌మెంటులో చెవిరెడ్డి.. చంద్ర‌గిరిలో వార‌సుడు పోటీ
- పాత ప్ర‌త్య‌ర్థి టీడీపీ నానిపై మోహిత్‌రెడ్డి జోరు
- తండ్రి ఛ‌రిష్మా, వివాద ర‌హితుడిగా గుర్తింపు ప్ల‌స్‌

( తిరుప‌తి - ఇండియా హెరాల్డ్ )

తిరుప‌తి పుణ్యక్షేత్రం ఉన్న చిత్తూరు జిల్లాలో ఈ సారి వార‌సులు జోరుగా రంగంలో ఉన్నారు. ముఖ్యంగా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌స్తుత ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి త‌న‌యుడు.. మోహిత్ రెడ్డి రంగంలో ఉన్నారు. చెవిరెడ్డి హ‌వా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌జల మ‌నిషిగా భాస్క‌ర‌రెడ్డి పేరు తెచ్చుకున్నారు. క‌రోనా స‌మ‌యంలో స్వ‌యంగా ఆయ‌న రంగంలో ఉండి మ‌రీ సేవ‌లు అందించారు.  అదేవిధంగా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కూడా పండ‌గ‌లు వ‌స్తే.. కానుక‌లు ఇస్తూ.. వారిని స్నేహితుల్లా చూసుకున్నారు.


ఇది.. రెండో సారి విజ‌యానికి కూడా.. దోహ‌ద ప‌డేలా చేసింది. వ‌రుస విజ‌యాలు అందుకున్న చెవిరెడ్డి.. ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయ‌న కుమారుడు.. మోహిత్ రెడ్డి బ‌రిలో ఉన్నా రు. తండ్రిని మించిన త‌న‌యుడు అవుతాడా?  కాడా? అన్న‌ది జూన్ 4న తేలిపోతుంది. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప్ర‌చార గ్రాఫ్‌.. స‌హా.. ఇత‌ర రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను ప‌రిశీలిస్తే.. మోహిత్‌రెడ్డి దూకుడు మామూలుగా క‌నిపించ‌డం లేదు. ఒక‌వైపు కూట‌మి ప‌క్షాన పాత ప్ర‌త్య‌ర్థే రంగంలో ఉండ‌డం.. మోహిత్ రెడ్డికి క‌లిసి వ‌స్తోంది.

అలా కాకుండా.. ఇత‌ర నేత ఉండి ఉంటే.. ఆర్థిక ప‌రిస్థితి, ప్ర‌జ‌ల్లో సానుభూతి వంటివి లెక్కించ‌డం మోహిత్‌కు క‌ష్ట‌మ‌య్యే ది. ఇక‌, స్థానికంగా మోహిత్‌కు ఉన్న ప‌రిచ‌యాలు.. ఆయ‌న కూడా.. స్తానిక నాయ‌కుడిగా ఉండ‌డం.. వార్డు నెంబ‌రుగా గెలుపు గుర్రం ఎక్క‌డం.. యువ‌తను ఎంగేజ్ చేయ‌డం.. వంటివి మోహిత్‌కు క‌లిసి వ‌స్తున్న కీల‌క విష‌యాలు. భాస్క‌ర‌రెడ్డి ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు కో ఆర్డినేట‌ర్‌గా గ‌త ఎన్నిక‌ల్లో ఉన్న మోహిత్ సక్సెస్ సాధించారు. ఇప్పుడు త‌న ఎన్నిక విష‌యంలోనూ మ‌రింత జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇక కొడుకు చంద్ర‌గిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే.. తండ్రి భాస్క‌ర్ రెడ్డి ఒంగోలు పార్ల‌మెంటు నుంచి పోటీలో ఉన్నారు. మ‌రి ఈ తండ్రి కొడుకుల గెలుపు రాత ఎలా ఉంటుందో ?


క‌ల‌సి వ‌చ్చే అంశాలు :
+ వివాద ర‌హిత నాయ‌కుడు
+ అంద‌రినీ క‌లుపుకొని పోయే వ్య‌క్తిత్వ ఉన్న యువ‌నేత‌గా గుర్తింపు
+ పేద‌ల‌క అందుబాటులో ఉండ‌డం.
+ 24 గంట‌లూ.. ఇంట్లో అందుబాటులో ఉంటాన‌ని చెప్ప‌డం.
+ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో అధికారుల‌ను ప‌రుగులు పెట్టించ‌డం.
+ వైసీపీలో ఎలాంటి వ్య‌తిరేక‌త లేకుండా క‌లుపుకొనిపోవ‌డం.


+ సొంత‌గా కొన్ని ప్ర‌త్యేక హామీలు ఇవ్వ‌డం.
+ త‌మ సంస్థ‌ల్లో స్థానికుల‌కు ఉద్యోగాలు ఇవ్వ‌డం.
+ తండ్రి చేసిన సేవ‌లు..
+ ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం.
+ వైసీపీ మేనిఫెస్టో కూడా క‌లిసి రానున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>