PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp8a078c3d-90f5-4b24-9322-bcf2bab5c923-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp8a078c3d-90f5-4b24-9322-bcf2bab5c923-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలక నియోజకవర్గాలలో తాడికొండ ఒకటి. ఈ నియోజకవర్గానికి ఎంత క్రేజ్ ఉండడానికి ప్రధాన కారణం రాజధాని అమరావతి ఎక్కువ భాగం ఈ నియోజకవర్గం లోనే ఉంది. అమరావతి ఎక్కువ భూభాగం ఈ నియోజకవర్గంలోనే ఉండడంతో ఇక్కడ అనేక ప్రభుత్వ కార్యాలయాలను ఇప్పటికే నిర్మించారు. ఇకపోతే చంద్రబాబు హయాంలో అమరావతి రాజధానిగా ప్రకటించి ఈ ప్రాంతంలో అనేక కార్యాలయాలు అభివృద్ధి పనులను చేపట్టినప్పటికీ 2019వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్యంగా ఈ ప్రాంతంలో వైసీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి ని గెTdp{#}Vundavalli Sridevi;Amaravati;Tenali;Thadikonda;Capital;Josh;bhavana;Kumaar;CBN;Jagan;Assembly;MLA;TDP;YCPతాడికొండలో దూసుకుపోతున్న టీడీపీ...సత్తా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వైసీపీ..?తాడికొండలో దూసుకుపోతున్న టీడీపీ...సత్తా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వైసీపీ..?Tdp{#}Vundavalli Sridevi;Amaravati;Tenali;Thadikonda;Capital;Josh;bhavana;Kumaar;CBN;Jagan;Assembly;MLA;TDP;YCPWed, 24 Apr 2024 10:59:00 GMTఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలక నియోజకవర్గాలలో తాడికొండ ఒకటి. ఈ నియోజకవర్గానికి ఎంత క్రేజ్ ఉండడానికి ప్రధాన కారణం రాజధాని అమరావతి ఎక్కువ భాగం ఈ నియోజకవర్గం లోనే ఉంది. అమరావతి ఎక్కువ భూభాగం ఈ నియోజకవర్గంలోనే ఉండడంతో ఇక్కడ అనేక ప్రభుత్వ కార్యాలయాలను ఇప్పటికే నిర్మించారు. ఇకపోతే చంద్రబాబు హయాంలో అమరావతి రాజధానిగా ప్రకటించి ఈ ప్రాంతంలో అనేక కార్యాలయాలు అభివృద్ధి పనులను చేపట్టినప్పటికీ 2019వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అనూహ్యంగా ఈ ప్రాంతంలో వైసీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి ని గెలిచింది.

ఇక ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల ఉండవల్లి శ్రీదేవి పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. ఇక ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేరు. ఇంతకాలం పాటు ఎమ్మెల్యే గా ఉన్న ఈమె చుట్టూ అనేకమంది ఉన్నారు. ఇక తాజాగా ఆమె సస్పెండ్ కావడంతో ఈమె చుట్టూ ఎవరూ లేరు. ఇక చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎంతోమంది వాటికి భూములను ఇచ్చారు. ఇక ఆ తర్వాత అభివృద్ధి పేరుతో జగన్ మూడు రాజధానులు అని చెప్పి అమరావతికి కాస్త అన్యాయం చేయడంతో అక్కడి ప్రజలంతా టీడీపీ బాట పట్టారు.

ఇంతకాలం వైసీపీ చుట్టూ తిరిగిన నేతలు కూడా ప్రస్తుతం టీడీపీ చుట్టే తిరుగుతున్నారు. ఇక ఈ ఎన్నికలను అటు జగన్, అటు చంద్రబాబు ఇద్దరు సీరియస్ గా తీసుకున్నారు. జగన్ ఇక్కడ గెలిచి జనాల్లో అమరావతి రాజధాని సెంటిమెంట్ లేదు అని నిరూపించాలి అని చూస్తే, చంద్రబాబు జనాల్లో అమరావతి డెవలప్మెంట్ కావాలి అని మూడు రాజధానులు వద్దు అనే భావన ఉంది నిరూపించడం కోసం ట్రై చేస్తున్నారు. ఇక ఇక్కడి నుండి తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ నుండి పోటీ చేస్తూ ఉండగా, వైసీపీ నుండి సుచరిత పోటీ చేస్తుంది. ఈ ప్రాంతంలో వైసీపీ పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉండడంతో సుచరితకు సపోర్టుగా పెద్ద క్యాడర్ కూడా లేదు. ఇక టీడీపీ మాత్రం బలమైన క్యాడర్ ఉండడంతో ఈ ప్రాంతంలో టీడీపీ నే ఫుల్ జోష్ లో ముందుకు దూసుకుపోయే సమీకరణాలు ఉన్నట్లు ఇక్కడ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>