PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/can-jagan-explain-his-soaring-wealth7e646993-7ce7-4807-ad54-99754f15062c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/can-jagan-explain-his-soaring-wealth7e646993-7ce7-4807-ad54-99754f15062c-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం వైఎస్ జగన్ సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేశారని తరచూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి. బాబు పాలన కంటే జగన్ పాలనలోనే ఏపీకి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఏకంగా 50 కంటే ఎక్కువ కంపెనీలు రావడం గమనార్హం. ycp{#}Chittoor;Vishakapatnam;kadapa;Jagan;CBN;YCP;CMజగన్ పాలనలో ఏపీకి వచ్చిన సంస్థలివే.. బాబు కంటే అభివృద్ధి చేశారు కానీ?జగన్ పాలనలో ఏపీకి వచ్చిన సంస్థలివే.. బాబు కంటే అభివృద్ధి చేశారు కానీ?ycp{#}Chittoor;Vishakapatnam;kadapa;Jagan;CBN;YCP;CMWed, 24 Apr 2024 08:05:00 GMTఏపీ సీఎం వైఎస్ జగన్ సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేశారని తరచూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి. బాబు పాలన కంటే జగన్ పాలనలోనే ఏపీకి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా వైసీపీ పాలనలో రాష్ట్రానికి ఏకంగా 50 కంటే ఎక్కువ కంపెనీలు రావడం గమనార్హం.
 
జగన్ సర్కార్ పెట్టుబడుల గురించి సరిగ్గా ప్రచారం చేసుకుంటే మాత్రం బాబును మించిన అభివృద్ధి జగన్ పాలనలోనే జరిగిందని సులువుగా అర్థమవుతుంది. కొన్ని నెలల క్రితం విశాఖలో పెట్టుబడుల సదస్సు జరగగా ఆ సదస్సులో ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాలలో ఇప్పటికే దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కార్యరూపం దాల్చడం గమనార్హం.
 
వైసీపీ పాలనలో వైజాగ్ లో అమెజాన్, విప్రో, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, అదిత్యా బిర్లా కంపెనీలు, మే ఫెయిర్, రహేజా ఇనార్బిట్, ఎకోహొమా టైర్స్, రాడ్ స్టాండ్ మరికొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. కర్నూలులోని చిన్న గ్రామంలో జే.ఎస్.డబ్ల్యూ సంస్థ భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. వైజాగ్ సమీపంలోని ప్రాంతాలలో, చిత్తూరు జిల్లా శ్రీసిటీ వద్ద, గుంటూరు, కడప, తిరుపతిలో ప్రముఖ కంపెనీలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టాయి.
 
ఓబెరాయ్ గ్రూప్ సంస్థ విశాఖ, తిరుపతి, కడప నగరాలలో 7 స్టార్ హోటల్స్ నిర్మాణం కొరకు ఒప్పందాలను కుదుర్చుకుంది. వైసీపీ నాయకులు ఈ కంపెనీల గురించి సరిగ్గా ప్రచారం చేసుకుంటే ఏపీలో అభివృద్ధి జరగలేదనే వాళ్ల నోర్లు మూయించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. వైసీపీ ప్రధానంగా సంక్షేమంపై దృష్టి పెట్టడం వల్ల అసలు వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు. ఎన్నికలకు సరిగ్గా 18 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని లెక్కలతో సహా వివరిస్తే వైసీపీకి కలిగే బెనిఫిట్ అంతాఇంతా కాదు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>