PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-c2e5ae88-f57a-4276-a1de-ac8037cd8287-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-c2e5ae88-f57a-4276-a1de-ac8037cd8287-415x250-IndiaHerald.jpgఎన్నికల వేళ ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ అంశం అనేది అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీతో జతకట్టిన టీడీపీ - జనసేనల నుంచి స్పష్టమైన ప్రకటన రాలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.మోడీని కాదని సొంతంగా విశాఖ ఉక్కు పరిశ్రమపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితిలో టీడీపీ - జనసేన నేతలు లేరనే కామెంట్లు వస్తున్నాయి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.ఇక ఈ ఎన్నికల్లో విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ అంశం కూడా అత్యంత కీలకమైన విషయంగా మారింJagan {#}editor mohan;Vishakapatnam;Yatra;News;Janasena;Reddy;central government;Andhra Pradesh;Jagan;TDP;YCP;Letter;CM;Elections;Bharatiya Janata Party;Partyస్టీల్ ప్లాంట్ పై జగన్ కామెంట్స్.. ఓట్లు రాలతాయంటారా?స్టీల్ ప్లాంట్ పై జగన్ కామెంట్స్.. ఓట్లు రాలతాయంటారా?Jagan {#}editor mohan;Vishakapatnam;Yatra;News;Janasena;Reddy;central government;Andhra Pradesh;Jagan;TDP;YCP;Letter;CM;Elections;Bharatiya Janata Party;PartyTue, 23 Apr 2024 14:37:00 GMTఎన్నికల వేళ ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ అంశం అనేది అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీతో జతకట్టిన టీడీపీ - జనసేనల నుంచి స్పష్టమైన ప్రకటన రాలేని పరిస్థితి  ప్రస్తుతం నెలకొంది.మోడీని కాదని సొంతంగా విశాఖ ఉక్కు పరిశ్రమపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితిలో టీడీపీ - జనసేన నేతలు లేరనే కామెంట్లు వస్తున్నాయి. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.ఇక ఈ ఎన్నికల్లో విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ అంశం కూడా అత్యంత కీలకమైన విషయంగా మారింది. ఇప్పటికే ఈ విషయంలో బీజేపీ ఎంతో దూకుడుగా వెళ్తుందని, తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ఆరు నెలల్లోనే అమ్మకం కన్ ఫాం అని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో స్పందించిన వైఎస్ జగన్... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి చేస్తూనే ఉందని ఆయన తెలిపారు."మేమంతా సిద్ధం" యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ దగ్గర విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు సీఎం జగన్‌ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భం వారితో మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో తమది రాజీ లేని ధోరణి అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో... రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు ఖచ్చితంగా అండగా నిలుస్తుందని తెలిపారు.


ఇంకా ఇదే సమయంలో... ఈ సమస్యపై మొట్టమొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తిందని గుర్తు చేసిన జగన్ మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం.. మొదటి సారిగా ప్రధానికి లేఖ రాయడంతో పాటు.. ఈ అంశంపై పరిష్కారాలు కూడా సూచించినట్లు ఆయన తెలిపారు. ఇదే సమయంలో కూటమిగా ఏర్పడిన విపక్షాలపైనా కూడా విమర్శలు చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.ఇక ఇందులో భాగంగా... ఎన్నికలు వచ్చేసరికి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా జత కట్టాయని.. ఇంకా కూటమిగా ఏర్పడ్డాయని చెప్పిన జగన్... విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రతిపక్షాలు నైతికతను, విలువలను విడిచిపెట్టాయని ఎంతగానో ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో... ఈ ఎన్నికల్లో కార్మికుల సపోర్ట్ కోరే నైతికత వైసీపీకే ఉందని తెలిపిన జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులకు విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఓట్ల కోసం జగన్ వారికి అండగా ఉంటానని అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>