MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suhas3619fdc8-c3a1-48d2-af70-731af92dc2a2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suhas3619fdc8-c3a1-48d2-af70-731af92dc2a2-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సుహాస్ తాజాగా "ప్రసన్న వదనం" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అర్జున్ వై కే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మణికంఠ , ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని మే 3 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను ఈ చిత్ర బృందం ఇప్పటికే అమ్మివేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ హక్కులను ది విలేజ్ గ్రూప్ సంస్థ దక్కించుకుంది. అందులో Suhas{#}prasad;suhas;Cinema;Telugu;cinema theater;Tamil;Success;Posters;Arjun;Telanganaప్రసన్న వదనం తెలంగాణ తమిళనాడు హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!ప్రసన్న వదనం తెలంగాణ తమిళనాడు హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!Suhas{#}prasad;suhas;Cinema;Telugu;cinema theater;Tamil;Success;Posters;Arjun;TelanganaTue, 23 Apr 2024 11:41:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సుహాస్ తాజాగా "ప్రసన్న వదనం" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అర్జున్ వై కే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మణికంఠ , ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని మే 3 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను ఈ చిత్ర బృందం ఇప్పటికే అమ్మివేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ హక్కులను ది విలేజ్ గ్రూప్ సంస్థ దక్కించుకుంది. 

అందులో భాగంగా యూ ఎస్ ఏ లో మే 2 వ తేదీనే ఈ మూవీ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్లు ఈ సంస్థ వారు ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను కూడా ప్రకటించింది. ఈ సినిమా యొక్క తెలంగాణ మరియు తమిళ నాడు థియేటర్ హక్కులను మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా యొక్క తెలంగాణ మరియు తమిళ నాడు థియేటర్ హక్కులను దక్కించుకున్న మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రైటర్ పద్మభూషణ్ , అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ లతో మంచి సక్సెస్ లో ఉన్న సుహస్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ తో సూహస్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో... ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>