PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kishan-reddys-hot-comments-on-the-phone-tapping-case13c0ce25-83fe-42f1-9c42-6c6035df0958-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kishan-reddys-hot-comments-on-the-phone-tapping-case13c0ce25-83fe-42f1-9c42-6c6035df0958-415x250-IndiaHerald.jpgతెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారం మొదలుపెట్టాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చాలా అన్యాయాలు, అక్రమాలు జరిగాయని అన్నారు కాంగ్రెస్ చేసిన అవినీతి అంతటిని గత పదేళ్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సరిదిద్దుతోందని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుంది అని తెలిపారు.kishan reddy{#}Telangana;central government;Bharatiya Janata Party;G Kishan Reddy;Congress;Narendra Modi;MP;Government;Prime Minister;Narendraకాంగ్రెస్ చేసిందేమీ లేదు: కేంద్రమంత్రికాంగ్రెస్ చేసిందేమీ లేదు: కేంద్రమంత్రిkishan reddy{#}Telangana;central government;Bharatiya Janata Party;G Kishan Reddy;Congress;Narendra Modi;MP;Government;Prime Minister;NarendraMon, 22 Apr 2024 17:18:12 GMTతెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు మొదలైంది. ఎంపీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారం మొదలుపెట్టాయి. అయితే ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చాలా అన్యాయాలు, అక్రమాలు జరిగాయని అన్నారు. కాంగ్రెస్ చేసిన అవినీతి అంతటిని గత  పదేళ్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సరిదిద్దుతోందని చెప్పుకొచ్చారు.

 బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుంది అని తెలిపారు.   దేశంలోని ప్రజలందరికీ సంక్షేమం, అభివృద్ధి అందించడమే బీజేపీ ప్రధాన లక్ష్యం అని కేంద్ర మంత్రి అన్నారు. అటు తెలంగాణ రాష్ట్రంలో, ఇటు దేశంలో ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చేలా బీజేపీ ఆలోచన చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ ప్రజలందరికీ మంచి విద్య, వైద్యం మోదీ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు.

వ్యవసాయం పశుగణాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.  అటు అభివృద్ధితో పాటు ఇటు దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడేందుకు మోడీ ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండేలా అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేశారు.  ఈసారి కూడా ప్రధానిగా నరేంద్ర మోడీయే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. బీజేపీ ప్రజా పాలనలో ప్రజలు ఎంతో అభివృద్ధి చెందారని లబ్ధి పొందాలని అన్నారు బిజెపి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని.. మంచి నాయకుడిని ఎన్నుకోవాలని తెలిపారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>