MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kasturi66148b70-6564-4adb-a6d4-52af3ca3ca89-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kasturi66148b70-6564-4adb-a6d4-52af3ca3ca89-415x250-IndiaHerald.jpgఅనేక సినిమాల్లో , సీరియల్ లలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి కస్తూరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె యంగ్ వయసులో ఉన్నప్పుడు అనేక భాషల సినిమాలలో నటించి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో ఈమె సీరియల్ ల వైపు దృష్టిని మళ్ళించింది. అందులో భాగంగా ఈమె అనేక సీరియల్ లలో నటించింది. ఇకపోతే ఈమె తెలుగు లో కూడా కొన్ని సీరియల్ లలో నటించింది. వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్Kasturi{#}eswari rao;kalyan ram;kasthuri;seetha;Interview;Rajani kanth;Heroine;Telugu;Hero;Cinema;BEAUTYఆ రెండు సినిమాల నుండి నన్ను అందుకే తీసేశారు... కస్తూరి..!ఆ రెండు సినిమాల నుండి నన్ను అందుకే తీసేశారు... కస్తూరి..!Kasturi{#}eswari rao;kalyan ram;kasthuri;seetha;Interview;Rajani kanth;Heroine;Telugu;Hero;Cinema;BEAUTYMon, 22 Apr 2024 08:45:00 GMTఅనేక సినిమాల్లో , సీరియల్ లలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి కస్తూరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె యంగ్ వయసులో ఉన్నప్పుడు అనేక భాషల సినిమాలలో నటించి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో ఈమె సీరియల్ ల వైపు దృష్టిని మళ్ళించింది. అందులో భాగంగా ఈమె అనేక సీరియల్ లలో నటించింది. ఇకపోతే ఈమె తెలుగు లో కూడా కొన్ని సీరియల్ లలో నటించింది.

వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించడంతో ఈమెకు బుల్లి తెర ఆఫర్ లు కూడా భారీ గానే పెరిగాయి. ఇకపోతే అప్పుడప్పుడు ఈమె కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా ఈమె నేను ఇప్పటికీ కూడా ఎంతో అందంగా ఉంటాను. ఆ అందం వల్లే నాకు కొన్ని సినిమా ఆఫర్ లు కూడా పోయాయి అని తెలియజేసింది. ఇకపోతే ఈ బ్యూటీ ఈ ఇంటర్వ్యూ లో భాగంగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా కస్తూరి మాట్లాడుతూ ... తాజాగా కళ్యాణ్ రామ్ "డెవిల్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఆ సినిమాలో సీత చేసిన తల్లి పాత్ర నేను చేయవలసింది.

కాకపోతే నేను చాలా యంగ్ గా కనిపిస్తున్నాను అనే ఉద్దేశంతో వారు ఆ సినిమా నుండి నన్ను తీసేశారు. అలాగే సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన కాల సినిమాలో కూడా నాకు ఆఫర్ వచ్చింది. కానీ రజనీ పక్కన పిల్లల తల్లిగా నేను సెట్ అవ్వను అనే ఉద్దేశంతో ఆ మూవీ నుండి కూడా నన్ను తీసేశారు. ఆ తర్వాత ఆ పాత్రలో ఈశ్వరి రావు నటించింది. ఈ ఆ సినిమా తర్వాత ఆమెకు ఆ వరుస ఆఫర్లు పెరిగాయి అని చెప్పుకొచ్చింది. ఇలా నేను అందంగా ఉన్నాను కాబట్టే కొన్ని పాత్రలకు నేను సెట్ కావడం లేదు. అందుకే నాకు వచ్చిన కొన్ని సినిమా ఆఫర్లు కూడా వెళ్ళిపోతున్నాయి అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>