MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ నటించిన సినిమాలలో ‘విక్రమార్కుడు’ మూవీ ఒక ట్రెండ్ సెటర్. రాజమౌళి దర్శకత్వంలో రవితేజా రెండు డిఫరెంట్ షేడ్స్ పాత్రలలో విక్రమ్ రాధోడ్ అత్తిలి సత్తిబాబు పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పటికీ ఛానల్స్ లో ఆసినిమా ప్రసారం అవుతున్నప్పుడు ప్రేక్షకులు ఆసినిమాను బాగా చూస్తూ ఉంటారు. రాజమౌళి పాన్ ఇండియా దర్శకుడు కాకముందు తీసిన ఈమూవీ ఆరోజులలో బ్లాక్ బష్టర్. ఈసినిమాకు సీక్వెల్ తీస్తే బాగుంటుంది అంటూ అనేకసార్లు మాస్ మహారాజ అభిమానులు కోరుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి రేంజ్ పాన్ raviteja{#}Ravi;radha mohan;ravi teja;Rajamouli;sampath nandi;vikram;producer;Audience;Comedy;Producer;K V Vijayendra Prasad;Darsakudu;Mass;Yevaru;Director;Industry;Cinema;Indiaవిక్రమార్కుడు 2 సాధ్యం అవుతుందా !విక్రమార్కుడు 2 సాధ్యం అవుతుందా !raviteja{#}Ravi;radha mohan;ravi teja;Rajamouli;sampath nandi;vikram;producer;Audience;Comedy;Producer;K V Vijayendra Prasad;Darsakudu;Mass;Yevaru;Director;Industry;Cinema;IndiaMon, 22 Apr 2024 08:19:14 GMTమాస్ మహారాజా రవితేజ నటించిన సినిమాలలో ‘విక్రమార్కుడు’ మూవీ ఒక ట్రెండ్ సెటర్. రాజమౌళి దర్శకత్వంలో రవితేజా రెండు డిఫరెంట్ షేడ్స్ పాత్రలలో విక్రమ్ రాధోడ్ అత్తిలి సత్తిబాబు పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పటికీ ఛానల్స్ లో ఆసినిమా ప్రసారం అవుతున్నప్పుడు ప్రేక్షకులు ఆసినిమాను బాగా చూస్తూ ఉంటారు. రాజమౌళి పాన్ ఇండియా దర్శకుడు కాకముందు తీసిన ఈమూవీ ఆరోజులలో బ్లాక్ బష్టర్.



ఈసినిమాకు సీక్వెల్ తీస్తే బాగుంటుంది అంటూ అనేకసార్లు మాస్ మహారాజ అభిమానులు కోరుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి రేంజ్ పాన్ వరల్డ్ డైరెక్టర్ గా మారిపోవడంతో తిరిగి జక్కన్న మాస్ మహారాజాల కాంబినేషన్ తిరిగి సెట్ అయ్యే ఆస్కారం కనిపించడంలేదు. అయితే ‘విక్రమార్కుడు’ మూవీ రీమేక్ అయిన అన్ని భాషలలోనూ బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడంతో ఈమూవీ సీక్వెల్ తీయాలి అంటూ రోజురోజుకు డిమాండ్ పెరుగుతూనే ఉంది.



లేటెస్ట్ గా ఈమూవీని తీసిన నిర్మాత కెకే రాధా మోహన్ ఒక ఫిలిమ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ ‘విక్రమార్కుడు 2’ కథ రెడీ అయిందని ఈమూవీ కథను విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశాడని క్లారిటీ ఇవ్వడంతో మాస్ మహారాజా ఆనందానికి హద్దులు లేవు. అయితే ఈ సీక్వెల్ కు రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశాలు లేకపోవడంతో ఈ సీక్వెల్ కు ఎవరు దర్శకులుగా వ్యవహరిస్తారు అన్నవిషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.



ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సీక్వెల్ కు దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహించే ఆస్కారం ఉంది అని అంటున్నారు. అయితే ఈ సీక్వెల్ పై అత్యంత భారీ అంచనాలు ఉంటాయి. రాజమౌళి గతంలో డిజైన్ చేసిన ‘అత్తిలి సత్తిబాబు’ రేంజ్ కామెడీ ఈ సీక్వెల్ లో సంపత్ నంది క్రియేట్ చేయగలడా అన్న సందేహాలు కూడ కొందరిలో ఉన్నాయి. ప్రస్తుతం వరసపెట్టి సినిమాలు చేస్తున్న రవితేజా ఎంతవరకు ఈ సీక్వెల్ కు ఓకె చెపుతాడు అన్న ప్రశ్నలు కూడ ఎదురవుతున్నాయి..








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>